Telugu Global
Others

చేనేత కార్మికుల‌కు యూవిన్ కార్డులు " ద‌త్తాత్రేయ 

కార్మిక‌శాఖ ద్వారా అసంఘటిత కార్మిక గుర్తింపు సంఖ్య (యువిన్‌) కార్డుల ద్వారా కేంద్ర ప‌థ‌కాల‌ను చేనేత కార్మికుల‌కు వ‌ర్తంప చేస్తామ‌ని కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ తెలిపారు.చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల్సిందిగా  ఏపీ, తెలంగాణ బీజేపీ నేత‌లు  మంత్రికి మంగ‌ళ‌వారం విన‌తిప‌త్రం అంద‌చేశారు. చేనేతకారుల ఉత్ప‌త్తుల‌ను మార్కెటింగ్ చేసేందుకు మ‌రిన్ని విక్ర‌య కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని, టెక్స్‌టైల్ హ్యాడ్లూం పార్కులు ఏర్పాటే చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర జౌళిశాఖ మంత్రిని సంతోష్ గంగ్వార్‌ను కోర‌తామ‌ని మంత్రి బండారు […]

కార్మిక‌శాఖ ద్వారా అసంఘటిత కార్మిక గుర్తింపు సంఖ్య (యువిన్‌) కార్డుల ద్వారా కేంద్ర ప‌థ‌కాల‌ను చేనేత కార్మికుల‌కు వ‌ర్తంప చేస్తామ‌ని కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ తెలిపారు.చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల్సిందిగా ఏపీ, తెలంగాణ బీజేపీ నేత‌లు మంత్రికి మంగ‌ళ‌వారం విన‌తిప‌త్రం అంద‌చేశారు. చేనేతకారుల ఉత్ప‌త్తుల‌ను మార్కెటింగ్ చేసేందుకు మ‌రిన్ని విక్ర‌య కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని, టెక్స్‌టైల్ హ్యాడ్లూం పార్కులు ఏర్పాటే చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర జౌళిశాఖ మంత్రిని సంతోష్ గంగ్వార్‌ను కోర‌తామ‌ని మంత్రి బండారు వారికి హామీ ఇచ్చారు. మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మె విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సెప్టెంబ‌రు 2న కార్మికులు చేపట్టే స‌మ్మెపై ప్ర‌ధానితో చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న అన్నారు. పుష్క‌రాల ప్రారంభోత్స‌వం రోజున రాజ‌మండ్రిలో జ‌రిగిన‌ దుర్ఘ‌ట‌న‌పై ఆయ‌న సంతాపం వ్య‌క్తం చేశారు.
First Published:  14 July 2015 1:10 PM GMT
Next Story