Telugu Global
Others

కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై కేసీఆర్ క‌న్ను!

తెలంగాణ కేబినెట్ త్వ‌ర‌లో పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తార‌న్న ఊహాగానాలు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌య్యాయి. ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో ఇద్ద‌రు, ముగ్గురు నాయ‌కుల‌కు మంత్రి ప‌ద‌వులిస్తామ‌ని ఆశ చూప‌డం… అదే భ్ర‌మ‌లో వారుండ‌డంతో కేబినెట్‌లో మార్పుల‌పై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్  మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేశార‌న్న వార్త‌లు మంత్రుల గుండెల్లో గుబుల్ రేకెత్తిస్తున్నాయి. మంత్రుల ప‌నితీరు ఆధారంగా రూపొందించిన‌ ఇయ‌ర్లీ ప్రోగ్రెస్ రిపోర్టుతో కొంత‌మందికి ఉద్వాస‌న‌లు, మ‌రి కొంత‌మందికి శాఖ‌ల […]

కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై కేసీఆర్ క‌న్ను!
X
తెలంగాణ కేబినెట్ త్వ‌ర‌లో పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తార‌న్న ఊహాగానాలు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌య్యాయి. ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో ఇద్ద‌రు, ముగ్గురు నాయ‌కుల‌కు మంత్రి ప‌ద‌వులిస్తామ‌ని ఆశ చూప‌డం… అదే భ్ర‌మ‌లో వారుండ‌డంతో కేబినెట్‌లో మార్పుల‌పై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేశార‌న్న వార్త‌లు మంత్రుల గుండెల్లో గుబుల్ రేకెత్తిస్తున్నాయి. మంత్రుల ప‌నితీరు ఆధారంగా రూపొందించిన‌ ఇయ‌ర్లీ ప్రోగ్రెస్ రిపోర్టుతో కొంత‌మందికి ఉద్వాస‌న‌లు, మ‌రి కొంత‌మందికి శాఖ‌ల మార్పులు త‌ప్ప‌దనే వార్త‌లు వెలువడుతున్నాయి. దీంతో ప‌ద‌వి ఉంటుందో, ఊడుతుందో తెలియ‌క మంత్రులు బిక్కుబిక్కుమంటున్నారు. చాలామంది మంత్రులు త‌మ శాఖ‌ల‌పై ప‌ట్టు సాధించ‌లేక పోయార‌ని, సీనియ‌ర్ శాస‌న‌స‌భ్యులు కూడా మంత్రులుగా నిల‌దొక్కుకోలేక పోయార‌ని, ఏడాది గ‌డిచినా త‌మ శాఖ‌ల మీద ప‌ట్టు కూడా సంపాదించ‌లేద‌ని సీఎం నివేదికల‌ సారాంశం. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదురైన వైద్యారోగ్య శాఖ మంత్రి రాజ‌య్య‌ను మంత్రివ‌ర్గం నుంచి సీఎం అక‌స్మాత్తుగా బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల‌ను హెచ్చ‌రించార‌ని తెలుస్తోంది. అలాగే డీఎస్ వంటి కాంగ్రెస్ ప్ర‌ముఖులు టీఆర్ఎస్‌లో చేరడంతో వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని, ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ‌లో ఒక్కొక్క‌రిని, హైద‌రాబాద్‌కు చెందిన మంత్రులు కొంత‌మందికి ఉద్వాస‌న త‌ప్ప‌క పోవ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. వివాదాస్ప‌దంగా మారిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ విష‌యంలో కూడా సీఎం ఒక నిర్ణ‌యానికి వచ్చే అవ‌కాశం ఉంద‌ని, ఈసారి మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌లకు ఛాన్స్ ఉండే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు.
First Published:  15 July 2015 12:09 AM GMT
Next Story