Telugu Global
Others

ముంబై త‌ర‌హాలో ఉమ్మ‌డి హైకోర్టులోనూ ఈ- కోర్టులు 

ముంబై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న ఈ-కోర్టుల‌ను తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టులోనూ త్వ‌రలో ప్రారంభిస్తామ‌ని తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దిలీప్ బి భోస‌లే తెలిపారు. హైకోర్టులో విచార‌ణ‌లో ఉన్న కేసుల వివ‌రాలను సుల‌భంగా తెలుసుకునేందుకు కొత్త‌గా రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్‌ను ఆయ‌న మంగ‌ళ‌వారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్  మాట్లాడుతూ త్వ‌ర‌లో హైకోర్టులో  ఐదు ఈ-కోర్టుల‌ను ప్రారంభిస్తామ‌ని అన్నారు. మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా పెండింగ్ కేసుల  స్టేట‌స్‌తో పాటు కాజ్‌లిస్ట్ జాబితా, […]

ముంబై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న ఈ-కోర్టుల‌ను తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టులోనూ త్వ‌రలో ప్రారంభిస్తామ‌ని తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దిలీప్ బి భోస‌లే తెలిపారు. హైకోర్టులో విచార‌ణ‌లో ఉన్న కేసుల వివ‌రాలను సుల‌భంగా తెలుసుకునేందుకు కొత్త‌గా రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్‌ను ఆయ‌న మంగ‌ళ‌వారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ మాట్లాడుతూ త్వ‌ర‌లో హైకోర్టులో ఐదు ఈ-కోర్టుల‌ను ప్రారంభిస్తామ‌ని అన్నారు. మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా పెండింగ్ కేసుల స్టేట‌స్‌తో పాటు కాజ్‌లిస్ట్ జాబితా, కోర్టుల్లో జ‌రుగుతున్న కేసుల విచార‌ణ వివ‌రాల‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. హైకోర్టులోని ప్ర‌తికోర్టు హాల్లో విచారిస్తున్న కేసు క్ర‌మ‌సంఖ్య‌ను యాప్ ద్వారా తెలిపే విధానాన్ని ఆగ‌స్టుల నెలాఖ‌రులోగా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని ఆయ‌న తెలిపారు. లాయ‌ర్ల‌కు వారి కేసు విచార‌ణకు వ‌చ్చే స‌మ‌యంలో ఎస్ఎంఎస్ ద్వారా అలెర్ట్ చేసే టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఆండ్రాయిడ్ అభివృద్ధికి, ఈకోర్టుల ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తున్న హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పోనుగోటి న‌వీన్‌రావుకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రిటైర్డ్ జ‌స్టిస్ కేసీ భాను త‌దిత‌ర్లు పాల్గొన్నారు.
First Published:  14 July 2015 1:07 PM GMT
Next Story