Telugu Global
Others

పాక్ లాట‌రీ త‌గిలిందా జాగ్ర‌త్త!

ఇదివ‌ర‌కు ఆఫ్రికా, యూరోపియ‌న్ దేశాల‌కు ప‌రిమిత‌మైన దొంగ లాట‌రీల బాగోతం ఇపుడు పాకిస్థాన్‌కు కూడా వ్యాపించింది. ఆ దేశానికి చెందిన మోస‌గాళ్ళు లాట‌రీల‌తో జ‌నానికి ఎర వేసి సొమ్ము చేసుకుంటున్నారు. లాటరీ తగిలిందంటూ పాకిస్థాన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీకు 5 నుంచి 10 లక్షలు లాటరీ తగిలిందని, అవి మీకు పంపాలంటే ఫలానా బ్యాంకులో 5 వేల నుంచి 10 వేలు డిపాజిట్‌ చేయాలంటూ ఫోన్లు రావడం తరచుగా చూస్తూనే ఉన్నాం. […]

ఇదివ‌ర‌కు ఆఫ్రికా, యూరోపియ‌న్ దేశాల‌కు ప‌రిమిత‌మైన దొంగ లాట‌రీల బాగోతం ఇపుడు పాకిస్థాన్‌కు కూడా వ్యాపించింది. ఆ దేశానికి చెందిన మోస‌గాళ్ళు లాట‌రీల‌తో జ‌నానికి ఎర వేసి సొమ్ము చేసుకుంటున్నారు. లాటరీ తగిలిందంటూ పాకిస్థాన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీకు 5 నుంచి 10 లక్షలు లాటరీ తగిలిందని, అవి మీకు పంపాలంటే ఫలానా బ్యాంకులో 5 వేల నుంచి 10 వేలు డిపాజిట్‌ చేయాలంటూ ఫోన్లు రావడం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆ డబ్బు డిపాజిట్‌ చేయగానే మీకు టోకరా పెట్టేస్తారు. రాజస్థాన్‌ సరిహద్దుల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్థిక శాఖ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించారు.​
First Published:  14 July 2015 1:11 PM GMT
Next Story