Telugu Global
Others

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి అప్పుల‌పై పీట‌ముడి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కున్న రూ. 33 కోట్ల అప్పుల‌ను ఏవిధంగా పంచాల‌నే విష‌యంపై ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సందిగ్ధ‌త నెల‌కొంది. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర్రప్ర‌దేశ్‌కు దేశ విదేశాల్లో రూ. ల‌క్షా 78 వేల కోట్ల అప్పు ఉండేది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏజీ కార్యాల‌యం లెక్క‌ల ఆధారంగా 90 శాతం ఆస్తుల‌ను, అప్పుల‌ను అధికారులు రెండు రాష్ట్రాల‌కు పంచేశారు. అయితే, రూ. 33 కోట్ల రుణాన్ని మాత్రం ఇంత‌వ‌ర‌కూ పంచ‌లేదు. ఈ రుణాన్ని […]

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి అప్పుల‌పై పీట‌ముడి
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కున్న రూ. 33 కోట్ల అప్పుల‌ను ఏవిధంగా పంచాల‌నే విష‌యంపై ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సందిగ్ధ‌త నెల‌కొంది. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర్రప్ర‌దేశ్‌కు దేశ విదేశాల్లో రూ. ల‌క్షా 78 వేల కోట్ల అప్పు ఉండేది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏజీ కార్యాల‌యం లెక్క‌ల ఆధారంగా 90 శాతం ఆస్తుల‌ను, అప్పుల‌ను అధికారులు రెండు రాష్ట్రాల‌కు పంచేశారు. అయితే, రూ. 33 కోట్ల రుణాన్ని మాత్రం ఇంత‌వ‌ర‌కూ పంచ‌లేదు. ఈ రుణాన్ని ఏవిధంగా పంచాల‌న్న విష‌యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య నెలకొంది. ఈ అప్పుల‌ను అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ ప‌ద్దులు మేర‌కు పంచుకోవాలా లేదంటే ఆస్తుల‌, అప్పుల విభ‌జ‌న కోసం ఏర్పాటు చేసిన షీలాబెడె క‌మిటీ సూచ‌న‌ల ప్ర‌కారం పంచుకోవాలా, లేదా జనాభా ప్రాతిపదిక పంచుకోవాలా అన్న‌ది రెండు రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తిన స‌మ‌స్య. ఉమ్మ‌డి రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేసేందుకు ప్ర‌పంచ బ్యాంకు, జ‌పాన్ వంటి దేశాల నుంచి తీసుకున్న రుణాలు, వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి, దారిద్ర్య నిర్మూల‌న‌కు కేంద్రం మంజూరు చేసిన రుణాల‌పై రెండు ప్ర‌భుత్వాలూ ఇంత‌వ‌ర‌కూ దృష్టి సారించ‌లేదు. ఈ ప‌థ‌కాలకు ఖ‌ర్చ‌యిన రూ. 33 కోట్ల‌పై వ‌డ్డీని ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీ స‌ర్కారే చెల్లిస్తోంది. ఈ అప్పుల‌ను పంచిన తర్వాత తెలంగాణ‌పై కూడా వ‌డ్డీ భారం ప‌డ‌నుంది. జ‌నాభా లెక్క‌ల నిష్ప‌త్తిలోనే ఈ రుణాన్ని ఇరురాష్ట్రాల‌కు పంచాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోరుతోంది. అయితే ఇందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అంగీక‌రించ‌డం లేదు. స‌మ‌స్య రెండు రాష్ట్రాల మ‌ధ్య సామ‌ర‌స్యంగా ప‌రిష్కారం కాకుంటే ఏజీ రంగంలోకి దిగుతార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు భావిస్తున్నాయి.
First Published:  14 July 2015 6:27 AM GMT
Next Story