Telugu Global
Others

ఇంజ‌నీరింగ్ అడ్మిష‌న్లపై సింగిల్ జ‌డ్జి తీర్పును స‌వ‌రిస్తాం 

బోధ‌నా సిబ్బంది, ల్యాబ్‌లున్న ఇంజ‌నీరింగ్‌, ఫార్మ‌సీ కాలేజీలకే గుర్తింపు ఇవ్వాల‌న్న తెలంగాణ ప్ర‌భుత్వ ఆత్రుత‌ను అర్థం చేసుకున్నట్లు హైకోర్టు ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. విద్యార్ధుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని,  గ‌తంలో  సింగిల్ జ‌డ్జి వెలువ‌రించిన‌ తీర్పును అవ‌స‌ర‌మైన మేరకు స‌వ‌రిస్తామ‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అయితే, సింగిల్ జ‌డ్జి తీర్పుపై  స్టే ఇవ్వ‌లేమ‌ని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దిలీప్ బి.బొసాలే, జ‌స్టిస్ ఎస్‌.వి.భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది.   కాలేజీల ప్ర‌యోజ‌నాల కంటే విద్యార్ధుల […]

బోధ‌నా సిబ్బంది, ల్యాబ్‌లున్న ఇంజ‌నీరింగ్‌, ఫార్మ‌సీ కాలేజీలకే గుర్తింపు ఇవ్వాల‌న్న తెలంగాణ ప్ర‌భుత్వ ఆత్రుత‌ను అర్థం చేసుకున్నట్లు హైకోర్టు ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. విద్యార్ధుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని, గ‌తంలో సింగిల్ జ‌డ్జి వెలువ‌రించిన‌ తీర్పును అవ‌స‌ర‌మైన మేరకు స‌వ‌రిస్తామ‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అయితే, సింగిల్ జ‌డ్జి తీర్పుపై స్టే ఇవ్వ‌లేమ‌ని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దిలీప్ బి.బొసాలే, జ‌స్టిస్ ఎస్‌.వి.భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. కాలేజీల ప్ర‌యోజ‌నాల కంటే విద్యార్ధుల భ‌విష్య‌త్తే కోర్టుకు ముఖ్య‌మ‌ని, క‌ళాశాల‌ల తుది అఫిలియేష‌న్‌కు ముందు కాలేజీల పూర్తిస్థాయి త‌నిఖీని ఏఐసీటీఈతో పాటు హైద‌రాబాద్ జేఎన్టీయూ కూడా చేస్తుంద‌ని అందుకోసం ఏఐసీటీఈ, జేఎన్టీయూల నుంచి ఇద్దరు స‌భ్యుల‌తో ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని ధ‌ర్మాస‌నం హామీ ఇచ్చింది. సింగిల్ జ‌డ్జి ఎదుట పిటిష‌న్ దాఖ‌లు చేసిన క‌ళాశాల‌ల‌ను ప్ర‌తివాదులుగా చేర్చుతూ జేఎన్టీయూ అప్పీళ్లు దాఖ‌లు చేయాల‌ని న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. మంగ‌ళ‌వారం అప్పీళ్లు దాఖ‌లు చేస్తే బుధ‌వారం విచార‌ణ జ‌రుపుతామ‌ని, అప్పీళ్ల‌లో వాద‌న విన్న త‌రువాతే త‌గిన ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.
First Published:  13 July 2015 1:09 PM GMT
Next Story