Telugu Global
Others

క‌ఠిన ష‌ర‌తుల‌తో గ్రీసుకు ఉద్దీప‌న ప్యాకేజీ

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన గ్రీసుకు కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది. క‌ఠిన‌మైన ష‌ర‌తుల‌తో కూడిన ఉద్దీప‌న ప్యాకేజీని గ్రీసుకు మంజూరు చేయ‌డానికి యూరోపియన్‌ దేశాలు అంగీక‌రించాయి. దీంతో గ్రీస్‌కు యూరో జోన్ నుంచి త‌ప్పుకోవాల్సిన ముప్పు త‌ప్పింది. అయితే, యూరో జోన్ స‌హాయం కోసం  గ్రీసు త‌న దేశంలో క‌ఠిన‌మైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ పెట్టాల్సి ఉంటుంద‌ని యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట‌ర్క్ వెల్ల‌డించారు. యూరో జోన్ స‌భ్యులు బ్రెజిల్ రాజ‌ధాని బ్ర‌స్సెల్స్‌లో స‌మావేశ‌మై, […]

క‌ఠిన ష‌ర‌తుల‌తో గ్రీసుకు ఉద్దీప‌న ప్యాకేజీ
X
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన గ్రీసుకు కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది. క‌ఠిన‌మైన ష‌ర‌తుల‌తో కూడిన ఉద్దీప‌న ప్యాకేజీని గ్రీసుకు మంజూరు చేయ‌డానికి యూరోపియన్‌ దేశాలు అంగీక‌రించాయి. దీంతో గ్రీస్‌కు యూరో జోన్ నుంచి త‌ప్పుకోవాల్సిన ముప్పు త‌ప్పింది. అయితే, యూరో జోన్ స‌హాయం కోసం గ్రీసు త‌న దేశంలో క‌ఠిన‌మైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ పెట్టాల్సి ఉంటుంద‌ని యూరోపియ‌న్ కౌన్సిల్ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట‌ర్క్ వెల్ల‌డించారు. యూరో జోన్ స‌భ్యులు బ్రెజిల్ రాజ‌ధాని బ్ర‌స్సెల్స్‌లో స‌మావేశ‌మై, గ్రీసు ఆర్థిక సంక్షోభం, రుణ స‌హాయం అంశాల‌పై సుమారు ప‌దిహేడు గంట‌లపాటు చ‌ర్చ‌లు జ‌రిపి, మూడో విడ‌త్ బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇచ్చేందుకు అంగీక‌రించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు గ్రీస్‌కు 9 వేల కోట్ల డాలర్ల అత్యవసర రుణం అవసరమని, ఇవి ఐదేళ్లలో ఆ దేశానికి అందుతాయని ఐరోపా దేశాల నేతలు చెబుతున్నారు. గ‌త ఐదేళ్ల‌లో యూరోజెన్ గ్రీసుకు ఆర్థిక స‌హాయం చేయ‌డం ఇది మూడోసారి. అయితే, ఈసారి గ్రీస్‌కు రుణాన్ని మంజూరు చేసేందుకు యూరో జోన్ క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు విధించింది. కార్మిక చ‌ట్టాలు, పెన్ష‌న‌ర్ల డ‌బ్బుతోపాటు ప్ర‌జ‌ల‌పై వ్యాట్ మోత మోగ‌నుంది. అంతేకాకుండా దేశంలో ప‌లు క‌ఠిన‌మైన ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసేందుకు గ్రీస్ అధ్య‌క్షుడు అంగీక‌రించాడు. ఐఐంఎఫ్ విధించే ష‌ర‌తుల‌ను కూడా అంగీక‌రించాల్సి ఉంటుంది. దేశ ప్ర‌జ‌లు మందులు, క‌నీస అవ‌స‌రాల‌కు కూడా డ‌బ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతుండడంతో గ్రీసు ఈ నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గి రుణం తీసుకునేందుకు అంగీక‌రించింది.
First Published:  14 July 2015 6:15 AM GMT
Next Story