Telugu Global
Others

వేలానికి ఏపీ ప్ర‌భుత్వ సెక్యూరిటీ బాండ్లు 

నిధులు లేక క‌ట‌క‌ట‌లాడుతున్న ఏపీ ప్ర‌భుత్వానికి రైతు రుణ‌మాఫీ గుదిబండ‌గా మారింది. జూన్‌లో రెండో విడ‌త రుణ‌మాఫీ మొద‌టి విడుత‌ నిధుల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.  రెండో విడుత నిధులు రూ. 2,207 కోట్ల‌ను ఈనెల‌లో విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే, ఆర్థిక‌శాఖ వ‌ద్ద నిధులు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వానికి అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను అమ్మి రూ. 1500 కోట్ల‌ను స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. భార‌తీయ రిజ‌ర్వ్‌బ్యాంక్ మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ సెక్యూరిటీ బాండ్ల‌ను వేలం […]

నిధులు లేక క‌ట‌క‌ట‌లాడుతున్న ఏపీ ప్ర‌భుత్వానికి రైతు రుణ‌మాఫీ గుదిబండ‌గా మారింది. జూన్‌లో రెండో విడ‌త రుణ‌మాఫీ మొద‌టి విడుత‌ నిధుల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రెండో విడుత నిధులు రూ. 2,207 కోట్ల‌ను ఈనెల‌లో విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే, ఆర్థిక‌శాఖ వ‌ద్ద నిధులు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వానికి అప్పులు చేయ‌క త‌ప్ప‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌ను అమ్మి రూ. 1500 కోట్ల‌ను స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. భార‌తీయ రిజ‌ర్వ్‌బ్యాంక్ మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ సెక్యూరిటీ బాండ్ల‌ను వేలం వేయ‌నుంది. వేలంలో వ‌చ్చే రూ. 1500 కోట్ల‌కు మ‌రో రూ. 707 కోట్లు క‌లిపి ఈ నెలాఖ‌రులోగా రుణ‌మాఫీ నిధులు విడుద‌ల చేయాల‌ని ఆర్థిక‌శాఖ భావిస్తోంది. ఎన్నిక‌ల హామీ మేర‌కు రైతు రుణ‌మాఫీ చేయ‌డంతో పాటు రైతుల పేరుతో ఉన్న బోగ‌స్ ఖాతాల‌ను ఏరివేయాల‌ని, నిజ‌మైన రైతుల‌కే మాఫీ వ‌ర్తింప చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇప్ప‌టికే బోగ‌స్ రైతు ఖాతాల‌పై దృష్టి పెట్టిన ప్ర‌భుత్వం ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటోంది.
First Published:  13 July 2015 1:10 PM GMT
Next Story