Telugu Global
Others

స‌ర్కారు బంద్‌పై టీఆర్ఎస్‌కు కిష‌న్‌రెడ్డి చుర‌క‌లు

పాల‌మూరు ఎత్తిపోతల ప‌థ‌కంపై ప్ర‌భుత్వం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తు ఏక‌ప‌క్ష ధోర‌ణితో నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పాల‌మూరుపై కేంద్రానికి లేఖ రాస్తే అందుకు త‌గిన స‌మాధానాన్ని ఆయ‌న‌కు కేంద్రం పంపుతుంద‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ రాసారన్న సాకుతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం బంద్‌కు పిలుపునివ్వ‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం ఎక్క‌డైనా బంద్ చేప‌డుతుందా? అని ఆయ‌న నిల‌దీసారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌పై ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌కుండా, […]

పాల‌మూరు ఎత్తిపోతల ప‌థ‌కంపై ప్ర‌భుత్వం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తు ఏక‌ప‌క్ష ధోర‌ణితో నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు పాల‌మూరుపై కేంద్రానికి లేఖ రాస్తే అందుకు త‌గిన స‌మాధానాన్ని ఆయ‌న‌కు కేంద్రం పంపుతుంద‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు కేంద్రానికి లేఖ రాసారన్న సాకుతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం బంద్‌కు పిలుపునివ్వ‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం ఎక్క‌డైనా బంద్ చేప‌డుతుందా? అని ఆయ‌న నిల‌దీసారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌పై ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లూ చేయ‌కుండా, చ‌ర్చించ‌కుండా ప్ర‌భుత్వం అడ్డ‌దారిలో నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని ఆయ‌న ఆరోపించారు. మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మెపై సీఎం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అదేవిధంగా పుష్క‌రాల కోసం ప్ర‌త్యేకంగా న‌డుపుతున్న ఆర్టీసీ బ‌స్సుల్లో 50 శాతం అద‌న‌పు చార్జీ వ‌సూలు చేయ‌డానికి నిర‌స‌న‌గా అన్ని బ‌స్సు డిపోల ఎదుట‌ నిర‌స‌న తెలుపుతామ‌ని హెచ్చ‌రించారు.

First Published:  12 July 2015 1:13 PM GMT
Next Story