Telugu Global
Others

పవన విద్యుత్‌లో డెన్మార్క్‌ సరికొత్త రికార్డు

పవన శక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తిలో డెన్మార్క్‌ సరికొత్త మైలురాయిని దాటింది. ఆ దేశ రోజువారీ విద్యుత్‌ అవసరంతో పోల్చితే..గత గురువారం 140 శాతం విద్యుత్‌ను పవనశక్తి నుంచి ఉత్పత్తి చేసిందని ‘ద గార్డియన్’ ప‌త్రిక‌ ప్రచురించింది. పునరుత్పత్తి శక్తి వనరు అయిన పవన శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేయటం కోసం డెన్మార్క్‌ విస్త్రతమైన ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గాలిమరలను అక్కడ విండ్‌ ఫార్మ్స్‌గా పేర్కొంటారు. విండ్‌ఫార్మ్స్‌ నుంచి […]

పవన శక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తిలో డెన్మార్క్‌ సరికొత్త మైలురాయిని దాటింది. ఆ దేశ రోజువారీ విద్యుత్‌ అవసరంతో పోల్చితే..గత గురువారం 140 శాతం విద్యుత్‌ను పవనశక్తి నుంచి ఉత్పత్తి చేసిందని ‘ద గార్డియన్’ ప‌త్రిక‌ ప్రచురించింది. పునరుత్పత్తి శక్తి వనరు అయిన పవన శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేయటం కోసం డెన్మార్క్‌ విస్త్రతమైన ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గాలిమరలను అక్కడ విండ్‌ ఫార్మ్స్‌గా పేర్కొంటారు. విండ్‌ఫార్మ్స్‌ నుంచి అదనంగా అందుబాటులోకి వచ్చిన ఈ విద్యుత్‌ను డెన్మార్క్‌ అవసరాలకు వాడుకున్నాక, మిగిలిన 80 శాతం విద్యుత్‌ను జర్మనీ, నార్వే దేశాలకు సరఫరా చేశారు. స్వీడన్‌కు 20 శాతం పంపిణీ జరిపారు. ఈ వివరాలన్నీ డెన్మార్క్‌ ‘ఎనర్జీనెట్‌.డికె’ సైట్‌లో పొందుపర్చారు. దీనిపై యూరోపియన్‌ విండ్‌ ఎనర్జీ అసోసియేషన్‌ పత్రికా ప్రతినిధి మాట్లాడుతూ..పునరుత్పత్తి శక్తి వనరుల నుండి ప్రపంచ విద్యుత్‌ అవసరాలు తీరటమనేది కల కాదని తాజా ఉదంతం రుజువు చేసిందన్నారు. ఈనాడు డెన్మార్క్‌ ప్రభుత్వానికి పవన విద్యుత్‌ నుంచి భారీ ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో పవన శక్తి నుంచి 29 శాతం తయరవుతుండగా, ఎక్కువగా బొగ్గు నుంచే విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 2035 నాటికల్లా పవన శక్తి నుంచి 84 శాతం విద్యుత్‌ అవసరాలను తీర్చాలని డెన్మార్క్‌ లక్ష్యంగా పెట్టుకుంది.​
First Published:  12 July 2015 1:14 PM GMT
Next Story