Telugu Global
Others

న‌ర‌సింహ‌న్‌తో దేశం గొడ‌వ స‌మ‌సిపోయిన‌ట్లేనా?

రెండు తెలుగురాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న గొడ‌వ స‌మ‌సిపోయిన‌ట్లేనా? ఇరుప‌క్షాలూ రాజీకి వ‌చ్చిన‌ట్లేనా?  గోదావ‌రి  పుష్క‌రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌డానికి వెళ్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా  ఇటీవల తమ మంత్రులు గవర్నర్‌ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు చంద్ర‌బాబు వ్యక్తిగతంగా విచారం వెలిబుచ్చినట్లు తెలిసింది.  దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో ఇరువురు అరమరికలు లేకుండా అన్ని విషయాలు చర్చించి నట్లు […]

న‌ర‌సింహ‌న్‌తో దేశం గొడ‌వ స‌మ‌సిపోయిన‌ట్లేనా?
X
రెండు తెలుగురాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న గొడ‌వ స‌మ‌సిపోయిన‌ట్లేనా? ఇరుప‌క్షాలూ రాజీకి వ‌చ్చిన‌ట్లేనా? గోదావ‌రి పుష్క‌రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌డానికి వెళ్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇటీవల తమ మంత్రులు గవర్నర్‌ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు చంద్ర‌బాబు వ్యక్తిగతంగా విచారం వెలిబుచ్చినట్లు తెలిసింది. దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో ఇరువురు అరమరికలు లేకుండా అన్ని విషయాలు చర్చించి నట్లు తెలుస్తోంది. గవర్నరును మార్చాలని తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రాన్ని కోరినట్లు మీడియాలో వచ్చిన వార్తల విషయాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. తాను అటువంటి ప్రస్తావన ఏదీ కేంద్రం వద్ద తేలేదని గవర్నర్‌కు చంద్ర‌బాబు స్పష్టంచేశార‌ట‌. తాము ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా న‌ర‌సింహ‌న్‌ను కేంద్రం మార్చ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు త‌మ వైఖ‌రిని మార్చుకున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది. అందుకే గ‌వ‌ర్న‌ర్‌తో గొడ‌వ క‌న్నా రాజీప‌డ‌డ‌మే మేల‌ని వారు నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, పుష్క‌రాల‌కు ఆహ్వానించే కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు అందుకు ఉప‌యోగించుకున్నార‌ని వినిపిస్తోంది.
ఓటుకు కోట్లు వివాదం ఉచ్ఛ‌ద‌శ‌కు చేరుకుని తామంతా సెక్ష‌న్ 8పై ర‌గ‌డ చేస్తున్న స‌మ‌యంలో త‌మ‌ను ఆదుకోనందుకు నిర‌స‌న‌గా గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌పై తెలుగుదేశం నాయ‌కులు, మంత్రులు ర‌క‌ర‌క‌లా వ్యాఖ్య‌లు చేశారు. చురుకుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. గంగిరెద్దులా త‌లూప‌రాద‌ని స‌ల‌హాలిచ్చారు. ఎపి మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌ బాబు, పల్లె రఘునాధ రెడ్డి తోపాటు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడు తదితరులు గవర్నరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇలాంటి గ‌వ‌ర్న‌ర్‌ను త‌క్ష‌ణం మార్చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే వీరిలో కొందరు తర్వాత అందుకు విచారం కూడా వ్యక్తం చేశారు. ఈ విష‌యంలో న‌ర‌సింహ‌న్ చాలా నొచ్చుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి కూడా. అంతేకాదు తెలుగుదేశం వ్య‌వ‌హారాన్ని కేంద్రం దృష్టికి కూడా ఆయ‌న తీసుకువెళ్లారు. స్వ‌యంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లుసుకుని ఈ విష‌యాల‌ను ఏక‌రువు పెట్టారు.
First Published:  12 July 2015 11:48 PM GMT
Next Story