Telugu Global
Others

అంగార‌క గ్రహంపైకి వెళ్ళ‌నున్న‌ సునీతా విలియ‌మ్స్ 

అంత‌రిక్షంలో  అత్య‌ధిక స‌మ‌యం న‌డిచిన మ‌హిళ (50.40గంట‌లు) గా రికార్డు సృష్టించిన నాసా వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ మ‌రో రికార్డు సృష్టించ‌నున్నారు. అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా 2030లో మాన‌వ స‌హిత అంగార‌క యాత్ర చేప‌ట్ట‌నుంది. ఈ యాత్ర‌కు భార‌త సంత‌తికి చెందిన సునీతా విలియ‌మ్స్ ఎంపిక‌య్యారు. ప‌ర్యాట‌కుల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తెచ్చేందుకు సునీత‌తో పాటు మ‌రో ముగ్గురు వ్యోమ‌గాములు రాబ‌ర్ట్ బెన్‌కెన్‌, ఎరిక్ బో, డ‌గ్ల‌స్ హ‌ర్లీల‌ను నాసా ఎంపిక చేసింది. […]

అంత‌రిక్షంలో అత్య‌ధిక స‌మ‌యం న‌డిచిన మ‌హిళ (50.40గంట‌లు) గా రికార్డు సృష్టించిన నాసా వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ మ‌రో రికార్డు సృష్టించ‌నున్నారు. అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా 2030లో మాన‌వ స‌హిత అంగార‌క యాత్ర చేప‌ట్ట‌నుంది. ఈ యాత్ర‌కు భార‌త సంత‌తికి చెందిన సునీతా విలియ‌మ్స్ ఎంపిక‌య్యారు. ప‌ర్యాట‌కుల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తెచ్చేందుకు సునీత‌తో పాటు మ‌రో ముగ్గురు వ్యోమ‌గాములు రాబ‌ర్ట్ బెన్‌కెన్‌, ఎరిక్ బో, డ‌గ్ల‌స్ హ‌ర్లీల‌ను నాసా ఎంపిక చేసింది. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి, అక్క‌డ నుంచి అంగార‌కుడి వ‌ద్ద‌కు ప‌ర్యాటకుల‌ను తీసుకెళ్లే క‌మ‌ర్షియ‌ల్ క్రూ వెహిక‌ల్స్ న‌డిపేందుకు వీరు శిక్ష‌ణ పొందుతున్నారు.ఈ రోద‌సి యాత్ర‌ల కోసం బోయింగ్‌, స్పేస్ ఎక్స్ కంపెనీల‌తో క‌లిసి వీరు ప‌ని చేయ‌నున్నారు. సునీతా విలియ‌మ్స్‌ను నాసా సంస్థ 1998లో మొద‌టిసారి వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు సార్లు అంత‌రిక్షంలోకి వెళ్లి 322 రోజులు అక్క‌డ గ‌డిపారు. అంతేకాదు అంత‌రిక్షంలో 50.40 గంట‌ల పాటు న‌డిచి అత్య‌ధిక స‌మయం న‌డిచిన మ‌హిళ వ్యోమ‌గామిగా రికార్డు సృష్టించారు.
First Published:  11 July 2015 1:10 PM GMT
Next Story