Telugu Global
Others

ప్ర‌భుత్వ విప్ ఎదుటే స‌ర్పంచ్ బావ దాష్టీకం

తాగునీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది ప‌రిష్క‌రించ‌మ‌ని అడిగిన నేరానికి ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడి చెంప చెళ్లుమ‌నిపించి ప‌వ‌ర్ దెబ్బ రుచి చూపించాడు అధికార పార్టీ స‌ర్పంచ్ బావ. అది కూడా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి, ప్ర‌భుత్వ విప్ స‌మ‌క్షంలోనే. ఈ సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది.  రాజంపేట మండ‌లంలోని సోమ‌శిల ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు రాజంపేట ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డిలు ఒంటిమిట్టకు  చేరుకున్నారు. అదే ఊర్లో నివ‌సిస్తున్న ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు […]

తాగునీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది ప‌రిష్క‌రించ‌మ‌ని అడిగిన నేరానికి ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడి చెంప చెళ్లుమ‌నిపించి ప‌వ‌ర్ దెబ్బ రుచి చూపించాడు అధికార పార్టీ స‌ర్పంచ్ బావ. అది కూడా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి, ప్ర‌భుత్వ విప్ స‌మ‌క్షంలోనే. ఈ సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. రాజంపేట మండ‌లంలోని సోమ‌శిల ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు రాజంపేట ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డిలు ఒంటిమిట్టకు చేరుకున్నారు. అదే ఊర్లో నివ‌సిస్తున్న ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు వెంక‌ట‌ర‌మ‌ణ గ్రామంలో తాగు నీరు స‌మ‌స్య అధికంగా ఉంద‌ని, నీరు స‌రిగా రావ‌డం లేద‌ని ప్ర‌భుత్వ విప్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్ర‌హించిన ఒంటిమిట్ట స‌ర్పంచ్ సుజాత బావ‌, టీడీపీ మండ‌ల అధ్య‌క్షుడు కొమ‌రా వెంక‌ట‌న‌ర‌స‌య్య ఉపాధ్యాయుడి చెంప చెళ్ళుమ‌నిపించాడు. మీ స‌మ‌క్షంలోనే ప్ర‌భుత్వ ఉద్యోగిపై టీడీపీ నేత దాడి చేశాడు చ‌ర్య‌లు తీసుకోమ‌ని అడిగినా ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ లు ప‌ట్టించుకోకుండా వెళ్లార‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న వాపోయారు.

First Published:  11 July 2015 1:21 PM GMT
Next Story