Telugu Global
Others

ఏపీలో రూ. 1500 కోట్లతో పుష్కరాల నిర్వహణ  

రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా నిర్వహిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలను రూ. 1500 కోట్లతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించే విధంగా 450 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. 15వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు […]

రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా నిర్వహిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలను రూ. 1500 కోట్లతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించే విధంగా 450 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. 15వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నా రు. పుష్కర ఘాట్లలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను ఏర్పాటుచేసి అక్కడి విశిష్టతలను ప్రతిబింబించే విధంగా ప్రదర్శించనున్నారని చెప్పారు.

First Published:  11 July 2015 1:07 PM GMT
Next Story