Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 141

సర్దుకున్నాను! తల్లి: భార్యాభర్తలన్నాక గొడవలైనప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. కూతురు: అందుకేనమ్మా…! మొత్తం సామానంతా సర్దుకొని వచ్చేశాను. ———————————————————————– ప్రశాంతతకోసం! “ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే పెళ్లాడావెందుకు?” “పగలన్నా ప్రశాంతంగా పడుకుందామని…!” ———————————————————————– సారీ సర్‌… మేనేజర్‌: ఈ కాగితాన్ని నీ డ్రాయర్లో ఉంచవయ్యా. క్లర్క్‌: సారీ సర్‌…! నేనీవేళ డ్రాయర్‌ వేసుకుని రాలేదు. ———————————————————————– వంట వాసన “ఈ పూట మీరింకా వంట చేయలేదేమి?” అడిగింది పక్కింటి కాంతం. “ఆ విషయం మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది […]

సర్దుకున్నాను!
తల్లి: భార్యాభర్తలన్నాక గొడవలైనప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి.
కూతురు: అందుకేనమ్మా…! మొత్తం సామానంతా సర్దుకొని వచ్చేశాను.
———————————————————————–
ప్రశాంతతకోసం!
“ఉద్యోగం చేస్తున్న అమ్మాయినే పెళ్లాడావెందుకు?”
“పగలన్నా ప్రశాంతంగా పడుకుందామని…!”
———————————————————————–
సారీ సర్‌…
మేనేజర్‌: ఈ కాగితాన్ని నీ డ్రాయర్లో ఉంచవయ్యా.
క్లర్క్‌: సారీ సర్‌…! నేనీవేళ డ్రాయర్‌ వేసుకుని రాలేదు.
———————————————————————–
వంట వాసన
“ఈ పూట మీరింకా వంట చేయలేదేమి?” అడిగింది పక్కింటి కాంతం.
“ఆ విషయం మీకెలా తెలుసు?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది పద్మ.
“ఇంకా మాడు వాసన రాకపోతేనూ!” అంది కాంతం.
———————————————————————–
“ఈత”రం భార్య
జనార్దన్‌: భర్తకు తగ్గ భార్య అంటే… ఎలాగుంటుందిరా!
శివకుమార్‌: “ఈ సంసారాన్ని ఈదలేక చస్తున్నా” అని భర్త అంటే…
“ఈత రాని వాడ్ని కట్టుకున్నాను నా ఖర్మ” అని ఏడిచేది!

First Published:  11 July 2015 1:03 PM GMT
Next Story