Telugu Global
Cinema & Entertainment

ఈ రెండు సినిమాల రిలీజ్ ఎప్పుడు..?

బాహుబలి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో.. రెండు సినిమాలు కూడా అదే స్థాయిలో ఎదురు చూశాయి. అవే కిక్-2, రుద్రమదేవి. అవును.. ఈ రెండు సినిమాలు బాహుబలి రిలీజ్ కోసం ఎదురుచూశాయి. ఆ సినిమా రిజల్ట్ బట్టి తమ సినిమా విడుదల తేదీల్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలు. ఎందుకంటే.. బాహుబలి అంతో ఇంతో ఖాళీ అయితే తప్ప ఈ రెండు సినిమాలకు థియేటర్లు దొరకవు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో […]

ఈ రెండు సినిమాల రిలీజ్ ఎప్పుడు..?
X
బాహుబలి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో.. రెండు సినిమాలు కూడా అదే స్థాయిలో ఎదురు చూశాయి. అవే కిక్-2, రుద్రమదేవి. అవును.. ఈ రెండు సినిమాలు బాహుబలి రిలీజ్ కోసం ఎదురుచూశాయి. ఆ సినిమా రిజల్ట్ బట్టి తమ సినిమా విడుదల తేదీల్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలు. ఎందుకంటే.. బాహుబలి అంతో ఇంతో ఖాళీ అయితే తప్ప ఈ రెండు సినిమాలకు థియేటర్లు దొరకవు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో బాహుబలి నడుస్తోంది. తెలంగాణలో అయితే దాదాపు 370 థియేటర్లలో బాహుబలే ఉంది. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలన్నా, డిస్ట్రిబ్యూటర్లు లాభాలు కళ్లజూడాలన్నా ఈ సినిమా కనీసం మరో 10 రోజులన్నా ఆడాలి. కాబట్టి మరో రెండు వారాల పాటు కిక్-2, రుద్రమదేవి సినిమాలు విడుదలయ్యే అవకాశాల్లేవు. తాజా సమాచారం ప్రకారం.. ఈనెల 24న కిక్-2ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి రుద్రమదేవిని కూడా థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. మరో 3 రోజుల్లో ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశముంది.
First Published:  10 July 2015 9:00 PM GMT
Next Story