Telugu Global
NEWS

చంద్ర‌బాబు ద్వంద వైఖ‌రి మానుకోవాలి:  భూమా

ఏపీ సీఎం చంద్ర‌బాబు ద్వంద వైఖ‌రి మానుకోవాలంటూ..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సూచించారు. శుక్ర‌వారం ఆయ‌న నంద్యాల‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేల అరెస్టు విష‌యంలో చంద్ర‌బాబు ద్వంద విధానాలు అనుస‌రించ‌డం త‌గ‌ద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల స‌మయంలో అవినీతికి పాల్ప‌డి ఏసీబీకి చిక్కిన రేవంత్ రెడ్డిని అరెస్ట‌చేస్తే ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమ‌తి తీసుకున్నారా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన సంగ‌తిని గుర్తు చేశారు. మ‌రి ఇటీవ‌ల ఏపీలో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను అరెస్టు చేసేట‌ప్పుడు […]

చంద్ర‌బాబు ద్వంద వైఖ‌రి మానుకోవాలి:  భూమా
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు ద్వంద వైఖ‌రి మానుకోవాలంటూ..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సూచించారు. శుక్ర‌వారం ఆయ‌న నంద్యాల‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేల అరెస్టు విష‌యంలో చంద్ర‌బాబు ద్వంద విధానాలు అనుస‌రించ‌డం త‌గ‌ద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌లో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల స‌మయంలో అవినీతికి పాల్ప‌డి ఏసీబీకి చిక్కిన రేవంత్ రెడ్డిని అరెస్ట‌చేస్తే ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమ‌తి తీసుకున్నారా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన సంగ‌తిని గుర్తు చేశారు. మ‌రి ఇటీవ‌ల ఏపీలో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను అరెస్టు చేసేట‌ప్పుడు ఆ నీతులు గుర్తుకు రాలేదా? అని నిల‌దీశారు. మీ పార్టీకి ఒక న్యాయం.. ఇత‌ర పార్టీల‌కు ఒక న్యాయం అనుస‌రించాలా? అని ప్రశ్నించారు. మ‌రోవైపు మీడియా ముందు ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడికి పాల్ప‌డిన ఎమ్మెల్యే చింత‌మ‌నేనిపై నాన్‌బెయిల‌బుల్ కేసులు న‌మోదైనా పోలీసులు ఇంత‌వ‌ర‌కు ఎందుకు అరెస్టు చేయ‌డం లేద‌న్నారు. ఓటుకు నోటు కుంభ‌కోణంలో తెలంగాణ పోలీసుల నుంచి త‌ప్పించుకు తిరిగిన ఎమ్మెల్యే సండ్ర‌కు ఏపీలో చికిత్స చేయించిన చంద్ర‌బాబు త‌నకు హైద‌రాబాద్‌లో చికిత్స చేయించుకునేందుకు ఎందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డం ఆయ‌న వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ద్వంద ప్ర‌మాణాలు పాటించ‌డం మానుకోవాల‌ని హిత‌వుప‌లికారు.
First Published:  11 July 2015 12:11 AM GMT
Next Story