Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లికి జురాసిక్ వాల్డ్‌కి ఏమిటి సంబంధం? 

మీరు జురాసిక్ వాల్డ్ చూశారా? అయితే అందులోని స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌పీరియ‌న్స్ బాహుబ‌లిలో కూడా ఉందంటున్నారు విశ్లేష‌కులు. బాహులి కోసం రాజ‌మౌళి ఎడ్వాన్స్ టెక్నాల‌జీ వాడాడు. ఇందులోని విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోవ‌ని క్రిటిక్స్ కూడా అంగీక‌రిస్తున్నారు. జురాసిక్ వాల్డ్ కోసం ప‌నిచేసిన స్పెష‌ల్ ఎఫెక్ట్స్ నిపుణులు బాహుబ‌లికి కూడా ప‌నిచేశారు. అందుకే బాహుబ‌లి ఔట్‌పుట్ ఈ రేంజ్‌లో ఉందంటున్నారు. గెరార్డ్ బ‌ట్ల‌ర్ 300కి ఇండియా స‌మాధానం బాహుబ‌లి హాలీవుడ్ సినిమా 300, దాని సీక్వెల్‌లోని […]

బాహుబ‌లికి జురాసిక్ వాల్డ్‌కి ఏమిటి సంబంధం? 
X

మీరు జురాసిక్ వాల్డ్ చూశారా? అయితే అందులోని స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌పీరియ‌న్స్ బాహుబ‌లిలో కూడా ఉందంటున్నారు విశ్లేష‌కులు. బాహులి కోసం రాజ‌మౌళి ఎడ్వాన్స్ టెక్నాల‌జీ వాడాడు. ఇందులోని విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోవ‌ని క్రిటిక్స్ కూడా అంగీక‌రిస్తున్నారు. జురాసిక్ వాల్డ్ కోసం ప‌నిచేసిన స్పెష‌ల్ ఎఫెక్ట్స్ నిపుణులు బాహుబ‌లికి కూడా ప‌నిచేశారు. అందుకే బాహుబ‌లి ఔట్‌పుట్ ఈ రేంజ్‌లో ఉందంటున్నారు.

గెరార్డ్ బ‌ట్ల‌ర్ 300కి ఇండియా స‌మాధానం బాహుబ‌లి
హాలీవుడ్ సినిమా 300, దాని సీక్వెల్‌లోని యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ప్ర‌పంచాన్ని నిర్ఘాంత‌ప‌రిచాయి. అయితే అందులోని విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి దీటుగా ఇండియా ఇచ్చిన స‌మాధాన‌మే బాహుబ‌లి అంటున్నారు ఫిల్మ్ పండిట్స్‌! గ్రాండ్ స్కేల్‌లో నిర్మించిన బాహుబ‌లి భ‌ళాబ‌లి అనిపించింది. ట్రైల‌ర్లు, టీజ‌ర్ల ద‌శ‌లోనే దుమ్మురేపింది. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించంది. ఇండియన్ సినిమా ఎప్ప‌టికీ హాలీవుడ్‌ని అందుకోలేడ‌న్న విమ‌ర్శ‌ల‌కు బాహుబ‌లి జ‌వాబు చెబుతోంది.

First Published:  10 July 2015 2:55 AM GMT
Next Story