Telugu Global
Cinema & Entertainment

హృతిక్, జాన్ అబ్ర‌హంల‌తో బాహుబ‌లి? 

ఆశ్చ‌ర్యంగా ఉందిక‌దూ! కానీ ఆ ప్ర‌య‌త్నం చేశాడుట రాజ‌మౌళి. అవును..బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామ‌నుకున్న జ‌క్క‌న్న‌., బాహుబ‌లి కోసం మొద‌ట హృతిక్ రోష‌న్‌, జాన్ అబ్ర‌హంల‌ను సంప్ర‌దించాడ‌ని బాలీవుడ్ మీడియా ఇప్పుడు కోడైకూస్తోంది. ఆ స‌మ‌యంలో వాళ్లు ఇత‌ర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో రాజ‌మౌళి స్క్రిప్ట్‌కి ఓకే చెప్ప‌లేక‌పోయారంటోంది. దాంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌భాస్‌-రానాల‌తో బాహుబ‌లి తీశాడంటోంది. అయితే క‌ర‌ణ్ జోహార్ బాహుబ‌లి హిందీ వెర్ష‌న్‌ని అద్భుతంగా ప్ర‌మోట్ చేశాడు. బాలీవుడ్‌లో కూడా త‌న బాహుబ‌లి […]

హృతిక్, జాన్ అబ్ర‌హంల‌తో బాహుబ‌లి? 
X

ఆశ్చ‌ర్యంగా ఉందిక‌దూ! కానీ ఆ ప్ర‌య‌త్నం చేశాడుట రాజ‌మౌళి. అవును..బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామ‌నుకున్న జ‌క్క‌న్న‌., బాహుబ‌లి కోసం మొద‌ట హృతిక్ రోష‌న్‌, జాన్ అబ్ర‌హంల‌ను సంప్ర‌దించాడ‌ని బాలీవుడ్ మీడియా ఇప్పుడు కోడైకూస్తోంది. ఆ స‌మ‌యంలో వాళ్లు ఇత‌ర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో రాజ‌మౌళి స్క్రిప్ట్‌కి ఓకే చెప్ప‌లేక‌పోయారంటోంది. దాంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌భాస్‌-రానాల‌తో బాహుబ‌లి తీశాడంటోంది.

అయితే క‌ర‌ణ్ జోహార్ బాహుబ‌లి హిందీ వెర్ష‌న్‌ని అద్భుతంగా ప్ర‌మోట్ చేశాడు. బాలీవుడ్‌లో కూడా త‌న బాహుబ‌లి గ్రాండ్‌గా రిలీజ్ కావ‌డంతో రాజ‌మౌళి హ్యాపీగా ఉన్నాడు. అయితే అప్పుడు రాజ‌మౌళికి ఓకే చెప్ప‌నందుకు ఇప్పుడు హృతిక్, జాన్‌లు ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు ఫిల్మ్ పండిట్స్‌! ఇక‌పై బాలీవుడ్ స్టార్స్ ఒక్క ఛాన్స్ అంటూ..జ‌క్క‌న్న వెంట‌ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు.

First Published:  10 July 2015 2:29 AM GMT
Next Story