Telugu Global
NEWS

ఢిల్లీలో చంద్ర‌బాబు బిజీబిజీ

జ‌పాన్ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఢిల్లీకి చేరిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు శుక్ర‌వారం దేశ రాజ‌ధానిలో బిజీబిజీగా గ‌డిపారు. ఆయ‌న ప‌లువురు కేంద్ర మంత్రుల్ని క‌లుసుకుని కొన్ని అనుమ‌తుల‌ను, కొన్ని ప‌థ‌కాల‌కు సంబంధించి నిధుల‌ను, పాల‌నాప‌ర‌మైన వెసులుబాటు చ‌ర్య‌ల‌ను ఆర్ధించారు. కేంద్ర ఇంధ‌న శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్‌ని క‌లిసిన ఆయ‌న రాష్ట్రంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాప‌న‌కు కేంద్రం ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో దీనికి సంబంధించి విధివిధానాల‌ను ఖ‌రారు చేయాల్సిందిగా కోరారు. అలాగే తెలంగాణ […]

ఢిల్లీలో చంద్ర‌బాబు బిజీబిజీ
X
జ‌పాన్ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఢిల్లీకి చేరిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు శుక్ర‌వారం దేశ రాజ‌ధానిలో బిజీబిజీగా గ‌డిపారు. ఆయ‌న ప‌లువురు కేంద్ర మంత్రుల్ని క‌లుసుకుని కొన్ని అనుమ‌తుల‌ను, కొన్ని ప‌థ‌కాల‌కు సంబంధించి నిధుల‌ను, పాల‌నాప‌ర‌మైన వెసులుబాటు చ‌ర్య‌ల‌ను ఆర్ధించారు. కేంద్ర ఇంధ‌న శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్‌ని క‌లిసిన ఆయ‌న రాష్ట్రంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాప‌న‌కు కేంద్రం ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో దీనికి సంబంధించి విధివిధానాల‌ను ఖ‌రారు చేయాల్సిందిగా కోరారు. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వం అక‌స్మాత్తుగా 1253 మంది ఏపీ ఉద్యోగుల‌ను స‌ర్వీసుల నుంచి రిలీవ్ చేసేసింద‌ని, వారంతా ఇపుడు రోడ్డున ప‌డ్డార‌ని, ఈవిష‌యంలో జోక్యం చేసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఇంధ‌న కార్య‌ద‌ర్శి ఉభ‌య రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ‌లు రాశార‌ని, ఈ స‌మ‌స్య‌కు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని పియూష్ చెప్పిన‌ట్టు తెలిసింది.
ఆ త‌ర్వాత చంద్ర‌బాబు మ‌రో కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌ను క‌లిసి రాజ‌ధానికి సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్య‌లు జ‌రిపారు. త‌మ రాజ‌ధాని అభివృద్ధికి కొంత అట‌వీశాఖ భూములు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన అనుమ‌తులు ఇచ్చి ఫారెస్ట్ భూముల‌ను డీ-నోటిఫై చేయాల్సిందిగా కోరారు. దీనికి జ‌వ‌దేక‌ర్ సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలిసింది. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో కొంత ఫారెస్ట్ భూమిని డీ-నోటిఫై చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఇందుకు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని చంద్ర‌బాబు కోరిన‌ట్టు తెలిసింది. వీరిద్ద‌రి స‌మావేశం ముగిసిన త‌ర్వాత ఉమ్మ‌డిగా మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను ధ్రువీక‌రించారు.
ప్ర‌స్తుతం ఆయ‌న షెడ్యూలులో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను క‌ల‌వాల్సి ఉంది. ఈ స‌మావేశంలో హైద‌రాబాద్‌లో సెక్ష‌న్ 8 అమ‌లు గురించి చ‌ర్చించ‌నున్నారు. ఆంధ్రుల‌కు హ‌క్కులు లేకుండా పోతున్న హైద‌రాబాద్‌లో ఈ సెక్ష‌న్‌తోనే ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని చంద్ర‌బాబు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తార‌ని తెలిసింది. కాగా మ‌రోమంత్రి ఉమా భార‌తితో కూడా స‌మావేశ‌మై పోల‌వరం ప‌థ‌కానికి నిధుల కొర‌త రాకుండా చూడాల‌ని, ప‌నులు ఆగ‌కుండా స‌కాలంలో ప్రాజెక్టు పూర్త‌యితే ప‌లు రాష్ట్రాల‌కు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. దీంతోపాటు తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న దిండి, పాలమూరు ప్రాజెక్టులు అనుమ‌తులు లేకుండా చేప‌డుతున్నార‌ని, ఇది భ‌విష్య‌త్‌లో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని ఆయ‌న కేంద్ర మంత్రి ఉమా భార‌తి దృష్టికి తెస్తార‌ని తెలుస్తోంది.
First Published:  10 July 2015 5:03 AM GMT
Next Story