Telugu Global
Cinema & Entertainment

 సోషల్ మీడియాలో బాహుబలి ఊపు

రిలీజ్ కు ముందు సోషల్ మీడియాను బాహుబలి ఓ ఊపు ఊపింది. ట్విట్టర్ , ఫేస్ బుక్, యూట్యూబ్ అనే తేడాలేకుండా అన్ని విభాగాల్లో తన సత్తా చాటింది. దీనికి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. నిన్నటి వరకు లెక్కలు చూసుకుంటే.. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో హిందీ సినిమాల్ని కూడా క్లాస్ చేసి ఫాలోవర్స్ ను సంపాదించుకుంది బాహుబలి.               […]

 సోషల్ మీడియాలో బాహుబలి ఊపు
X
రిలీజ్ కు ముందు సోషల్ మీడియాను బాహుబలి ఓ ఊపు ఊపింది. ట్విట్టర్ , ఫేస్ బుక్, యూట్యూబ్ అనే తేడాలేకుండా అన్ని విభాగాల్లో తన సత్తా చాటింది. దీనికి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. నిన్నటి వరకు లెక్కలు చూసుకుంటే.. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో హిందీ సినిమాల్ని కూడా క్లాస్ చేసి ఫాలోవర్స్ ను సంపాదించుకుంది బాహుబలి.
ఫేస్ బుక్ లో బాహుబలి పేజ్ కు 13లక్షల హిట్స్ వచ్చాయి. అది కూడా రిలీజ్ కు ముందువరకు వచ్చిన హిట్స్. రిలీజ్ తర్వాత ఈ పేజ్ కు మరిన్ని హిట్స్ వచ్చే అవకాశముంది. అటు ట్విట్టర్ లో కూడా దాదాపు లక్ష మంది బాహుబలి సినిమాను ఫాలో అవుతున్నారు. ఈరోజు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మరోవైపు యూట్యూబ్ లో బాహుబలి ట్రయిలర్ ను చూసినవాళ్ల సంఖ్య ఇప్పటికే 45లక్షలు దాటింది. ఈ లెక్కలతో బాహుబలి సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించినట్టయింది.
First Published:  10 July 2015 2:06 AM GMT
Next Story