Telugu Global
Cinema & Entertainment

జేమ్స్ బాండ్ కు  ప్ర‌భాస్ సాయం...!

నిజంగా  హెడ్డింగ్ చూస్తే… ప్ర‌భాస్ జేమ్స్ బాండ్ కు సాయం చేసే రేంజ్ కు ఎప్పుడు రీచ్ అయ్యాడ‌బ్బా సినిమాల ప‌రంగా అనే సందేహాం క‌లుగుతుంది.  అయితే  ఇక్క‌డ సంద‌ర్భం .. ప‌ర్స‌న్స్ వేరండోయ్.! ఇక్క‌డ జేమ్స్ బాండ్   .. డానియెల్ గ్రేగ్ కాదండోయ్..  జ‌స్ట్ మ‌న అల్ల‌రోడు.  విష‌యం కొంత బోధ ప‌డి వుంటుంది క‌దా. ఈ మ‌ధ్య  జేమ్స్ బాండ్   ..నేను కాదు నా పెళ్లాం అనే  ట్యాగ్ లైన్ తో ఒక చిత్రం […]

జేమ్స్ బాండ్ కు  ప్ర‌భాస్ సాయం...!
X

నిజంగా హెడ్డింగ్ చూస్తే… ప్ర‌భాస్ జేమ్స్ బాండ్ కు సాయం చేసే రేంజ్ కు ఎప్పుడు రీచ్ అయ్యాడ‌బ్బా సినిమాల ప‌రంగా అనే సందేహాం క‌లుగుతుంది. అయితే ఇక్క‌డ సంద‌ర్భం .. ప‌ర్స‌న్స్ వేరండోయ్.! ఇక్క‌డ జేమ్స్ బాండ్ .. డానియెల్ గ్రేగ్ కాదండోయ్.. జ‌స్ట్ మ‌న అల్ల‌రోడు. విష‌యం కొంత బోధ ప‌డి వుంటుంది క‌దా. ఈ మ‌ధ్య జేమ్స్ బాండ్ ..నేను కాదు నా పెళ్లాం అనే ట్యాగ్ లైన్ తో ఒక చిత్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈసినిమాను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. అస‌లే అల్ల‌రి న‌రేష్ కు రెండు సంవ‌త్స‌రాల నుంచి మంచి హిట్ లేక స‌త‌మతం అవుతున్నాడు. దీంతో బాహుబ‌లి చిత్రంతో టై అప్ అయ్యార‌ట‌. అంటే బాహుబ‌లి ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్స్ అన్నింటిలో న‌రేష్ న‌టించిన జేమ్స్ బాండ్ సినిమా ట్రైల‌ర్స్ ను ప్లే చేస్తార‌ట‌. ఇది నిజంగా అల్ల‌రోడికి బంప‌ర్ ఆఫ‌ర్ అనే చెప్పాలి క‌దా.! బాహుబ‌లి సినిమాను చూసిన ప్రేక్ష‌కుల్లో 20 శాతం మంది జేమ్స్ బాండ్ ను చూసినా.. అల్ల‌రి న‌రేష్ బౌన్స్ బ్యాక్ కావ‌డం ఖాయం క‌దా.!

First Published:  10 July 2015 3:20 AM GMT
Next Story