Telugu Global
Others

యువ‌కుల్లో వృద్ధాప్య ఛాయ‌లు!

ఈనాటి యువ‌తలో వృద్ధాప్య ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని, అర‌వై ఏళ్ల వ‌య‌సులో రావ‌ల్సిన ఆరోగ్య స‌మ‌స్య‌లు 25 నుంచి 30 ఏళ్ల లోపు వారికే వ‌స్తున్నాయ‌ని వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వృద్ధుల్లో కనిపించే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌, ఊపిరితిత్తులు, జీర్ణ‌క్రియ‌, రోగ‌నిరోధ‌కశ‌క్తి వంటి అన్ని ర‌కాల వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు మంద‌గించ‌డం పాతికేళ్ల యువ‌త‌లో కూడా క‌న్పిస్తున్న‌ట్లు జెరూస‌లెంకు చెందిన అంత‌ర్జాతీయ సంస్థ జ‌రిపిన తాజా అధ్య‌య‌నంలో తేలింది, బ్రిట‌న్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్ దేశాల్లోని 26 నుంచి 38 […]

ఈనాటి యువ‌తలో వృద్ధాప్య ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని, అర‌వై ఏళ్ల వ‌య‌సులో రావ‌ల్సిన ఆరోగ్య స‌మ‌స్య‌లు 25 నుంచి 30 ఏళ్ల లోపు వారికే వ‌స్తున్నాయ‌ని వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వృద్ధుల్లో కనిపించే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌, ఊపిరితిత్తులు, జీర్ణ‌క్రియ‌, రోగ‌నిరోధ‌కశ‌క్తి వంటి అన్ని ర‌కాల వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు మంద‌గించ‌డం పాతికేళ్ల యువ‌త‌లో కూడా క‌న్పిస్తున్న‌ట్లు జెరూస‌లెంకు చెందిన అంత‌ర్జాతీయ సంస్థ జ‌రిపిన తాజా అధ్య‌య‌నంలో తేలింది, బ్రిట‌న్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్ దేశాల్లోని 26 నుంచి 38 ఏళ్ల వ‌య‌సు గ‌ల వారిపై ఈ సంస్థ అధ్య‌య‌నం జ‌రిపింది. వీరిలో యుక్త వ‌య‌స్సులోనే వృద్ధాప్య ల‌క్ష‌ణాలున్నాయ‌ని, కొంత‌మంది యువ‌కులైతే త‌మ వ‌య‌సు కంటే మూడు రెట్లు అధిక వ‌య‌సు గ‌ల వారికి వ‌చ్చే ఆరోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. యువ‌త ఆహారంలో వ‌చ్చిన మార్పులు, వ్య‌స‌నాలు, కాలుష్యంతో పాటు జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు కూడా ఇందుకు కార‌ణ‌మ‌ని బృంద స‌భ్యుడు ప్రొఫెస‌ర్ సాల్మ‌న్ ఇజ్రాయెల్ అన్నారు. యువ‌త‌రం త‌మ ఆరోగ్యం ప‌ట్ల‌, ఆహార‌పుట‌ల‌వాట్లు ప‌ట్ల జాగ్ర‌త్త తీసుకోవాల‌ని లేనిప‌క్షంలో ముందుముందు మ‌రింత వృద్ధుల‌వుతార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

First Published:  9 July 2015 1:11 PM GMT
Next Story