Telugu Global
Others

టాప్‌ 5లో ఉస్మానియా వ‌ర్శిటీ

ఉస్మానియా యూనివర్శిటీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోని అత్యున్నత యూనివర్శిటీల్లో ఐదో స్థానం సంపాదించడంతో పాటు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలించింది. ప్రముఖ పొలిటికల్‌ మ్యాగజైన్‌ ఇండియా టుడే గ్రూప్ – నీల్సన్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన దేశంలోని అత్యున్నత యూనివర్శిటీల సర్వేలో ఉస్మానియాకు ఐదో స్థానం దక్కింది. రాష్ట్ర స్థాయి యూనివర్శిటీ్లో అగ్రస్థానంలో నిలిచిందని ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఈ సురేష్‌కుమార్ తెలిపారు. మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, బెనారస్‌ యూనివర్శిటీలు, మూడో స్థానంలో జవహరలాల్ […]

ఉస్మానియా యూనివర్శిటీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోని అత్యున్నత యూనివర్శిటీల్లో ఐదో స్థానం సంపాదించడంతో పాటు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలించింది. ప్రముఖ పొలిటికల్‌ మ్యాగజైన్‌ ఇండియా టుడే గ్రూప్ – నీల్సన్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన దేశంలోని అత్యున్నత యూనివర్శిటీల సర్వేలో ఉస్మానియాకు ఐదో స్థానం దక్కింది. రాష్ట్ర స్థాయి యూనివర్శిటీ్లో అగ్రస్థానంలో నిలిచిందని ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఈ సురేష్‌కుమార్ తెలిపారు. మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, బెనారస్‌ యూనివర్శిటీలు, మూడో స్థానంలో జవహరలాల్ నెహ్రూ యూనివర్శిటీ, నాలుగోస్థానంలో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలున్నాయని ఆయన చెప్పారు.గతేడాది ఏడో స్థానంలో ఉన్న ఉస్మానియా ఈ ఏడాది ఐదో ర్యాంక్‌ సాధించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఓయూ తర్వాత స్థానంలో హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్శిటీ ఉంది.
First Published:  8 July 2015 1:10 PM GMT
Next Story