Telugu Global
Others

రంజాన్ పుణ్య దానాల‌తో పేద‌ల‌కు ఆరోగ్యనిధి

పవిత్ర రంజాన్ మాసంలో జ‌కాత్ పేరుతో ముస్లింలు  చేసే దాన‌ధ‌ర్మాల‌ను పేద‌ల ఆరోగ్య నిధిగా మారుస్తూ ఆ పైకంతో ఎంతోమంది జీవితాల్లో ఆరోగ్యదివ్వె వెలిగిస్తోంది హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేష‌న్ (హెచ్‌హెచ్ఎఫ్). హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన కొంత‌మంది యువ‌కులు క‌లిసి ఈ స్వ‌చ్ఛంద సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గ‌త ఏడాది జ‌కాత్ రూపంలో  రూ. 3.11 కోట్ల రూపాయ‌ల విరాళాల‌ను సేక‌రించి తీవ్ర‌మైన‌ జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న పేద‌వారి వైద్యచికిత్స‌కు ఆస‌రాగా నిల‌బ‌డింది. రంజాన్ మాసంలో దానాన్ని స్వీక‌రించిన వారి వివ‌రాలు దాత‌కు, […]

రంజాన్ పుణ్య దానాల‌తో పేద‌ల‌కు ఆరోగ్యనిధి
X
పవిత్ర రంజాన్ మాసంలో జ‌కాత్ పేరుతో ముస్లింలు చేసే దాన‌ధ‌ర్మాల‌ను పేద‌ల ఆరోగ్య నిధిగా మారుస్తూ ఆ పైకంతో ఎంతోమంది జీవితాల్లో ఆరోగ్యదివ్వె వెలిగిస్తోంది హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేష‌న్ (హెచ్‌హెచ్ఎఫ్). హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన కొంత‌మంది యువ‌కులు క‌లిసి ఈ స్వ‌చ్ఛంద సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గ‌త ఏడాది జ‌కాత్ రూపంలో రూ. 3.11 కోట్ల రూపాయ‌ల విరాళాల‌ను సేక‌రించి తీవ్ర‌మైన‌ జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న పేద‌వారి వైద్యచికిత్స‌కు ఆస‌రాగా నిల‌బ‌డింది. రంజాన్ మాసంలో దానాన్ని స్వీక‌రించిన వారి వివ‌రాలు దాత‌కు, దానం చేసిన వారెవ‌ర‌న్న‌ది గ్ర‌హీత‌కు తెలియ‌కూడ‌ద‌ని అదే జ‌కాత్ ప‌ర‌మార్ధ‌మ‌ని ఈ సంస్థ నిర్వాహ‌కుల్లో ఒక‌రైన అక్సారీ తెలిపారు. హెచ్‌హెచ్ఎఫ్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 150 మంది నిరుపేద‌ల‌కు మేజర్ ఆప‌రేష‌న్లు చేయించామ‌ని, ఇంకా ఎంతోమందికి వైద్య‌చికిత్స కోసం స‌హాయం చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వైద్య చికిత్సక‌య్యే ఆర్థిక స‌హాయం కోసం త‌మ‌ను సంప్ర‌దించిన వారికి త‌క్ష‌ణ సాయ‌మందిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అప్లాస్టిక్ ఎనీమియాతో బాధ‌ప‌డుతున్న నిరుపేద కారు డ్రైవ‌ర్ కుమారుడు అదిల్ బేగ్ అనే చిన్నారికి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే త‌ప్ప బ‌త‌క‌డ‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేయ‌డంతో, వేలూరు సీఎంసీ ఆస్ప‌త్రిలో తాము రూ. 4 లక్ష‌ల ఫీజును క‌ట్టామ‌ని, మిగిలిన ఫీజును ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధి నుంచి మంజూరయ్యేలా కృషి చేశామ‌ని అన్నారు. మ‌రో కేసులో నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవ‌ర్ షేక్ స‌బీర్ నోటి క్యాన్స‌ర్ వైద్య చికిత్స‌కు స‌హాయమందించ‌డంతో పాటు ఆయ‌న కుటుంబ నిర్వ‌హ‌ణ‌కు కూడా ఆర్థిక సాయ‌మందించామ‌ని అక్సారీ తెలిపారు. త‌మ‌ ఫౌండేష‌న్ ద్వారా ముఖ్యంగా దీర్ఘ‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి, శారీర‌క, మాన‌సిక విక‌లాంగుల‌కు స‌హాయ‌మందిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  7 July 2015 3:35 AM GMT
Next Story