Telugu Global
Others

తెలంగాణ‌లో మ‌రో 33 కొత్త వ్య‌వ‌సాయ మార్కెట్లు 

తెలంగాణ వ్యాప్తంగా మ‌రో 33 కొత్త వ్య‌వసాయ మార్కెట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని మార్కెటింగ్ శాఖ  నిర్ణ‌యించింది. రైతుల ప్ర‌యోజ‌నం కోసం మార్కెట్ల సంఖ్య‌తో పాటు గోదాముల సంఖ్య‌ను కూడా పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రాబాద్ లోని గుడిమ‌ల్కాపూర్‌, రంగారెడ్డిలోని బ‌షీరాబాద్, కోటిప‌ల్లి, కుల్క‌చ‌ర్ల‌, మ‌హేశ్వ‌రం మండ‌లాల్లో కొత్త మార్కెట్లు రానున్నాయి. మెద‌క్ జిల్లాలోని నంగునూర్‌, చిన్న‌కోడూరు, కొండ‌పాక‌, పాప‌న్న‌పేట‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా పెబ్బేరు, కొల్హాపూర్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా బెజ్జంకి, కోహెడ‌, రాచెర్ల‌, బొప్పాపూర్‌, ఇల్లంత‌కుంట‌, రుద్రంగి, […]

తెలంగాణ వ్యాప్తంగా మ‌రో 33 కొత్త వ్య‌వసాయ మార్కెట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యించింది. రైతుల ప్ర‌యోజ‌నం కోసం మార్కెట్ల సంఖ్య‌తో పాటు గోదాముల సంఖ్య‌ను కూడా పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రాబాద్ లోని గుడిమ‌ల్కాపూర్‌, రంగారెడ్డిలోని బ‌షీరాబాద్, కోటిప‌ల్లి, కుల్క‌చ‌ర్ల‌, మ‌హేశ్వ‌రం మండ‌లాల్లో కొత్త మార్కెట్లు రానున్నాయి. మెద‌క్ జిల్లాలోని నంగునూర్‌, చిన్న‌కోడూరు, కొండ‌పాక‌, పాప‌న్న‌పేట‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా పెబ్బేరు, కొల్హాపూర్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా బెజ్జంకి, కోహెడ‌, రాచెర్ల‌, బొప్పాపూర్‌, ఇల్లంత‌కుంట‌, రుద్రంగి, శ్రీరాంపూర్‌, రాయిక‌ల్‌, గోపాల్‌రావుపేట‌, క‌మాన్‌పూర్‌, వెల్గ‌టూరు, జూప‌ల్లి, కారేప‌ల్లి, గంభీరావుపేట‌, పెగ‌డ‌ప‌ల్లిలో కొత్త వ్య‌వ‌సాయ మార్కెట్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. నిజామాబాద్ జిల్లా కోట‌గిరి, బీర్కూర్‌, బిచ్చుంద‌, ద‌ర్ప‌ల్లి, ఆర్గుల్‌, స‌దాశివ‌న‌గ‌ర్‌, వేల్పూర్‌, ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండ‌ల కేంద్రంలో కూడా నూత‌న మార్కెట్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది.
First Published:  6 July 2015 1:04 PM GMT
Next Story