Telugu Global
Others

త్వ‌ర‌లో వేం న‌రేంద‌ర్ రెడ్డి అరెస్ట్‌!

ఓటుకు నోటు కేసులో ఏసీబీ వేగం పెంచింది.  ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను సోమ‌వారం అరెస్టుచేసిన ఏసీబీ, ప్ర‌స్తుతం ఈకేసులోమ‌రో  కీల‌క వ్య‌క్తి జిమ్మిబాబు కోసం వేట ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన అత‌ను దొరికితే అరెస్టు త‌ప్ప‌ద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన వేం న‌రేంద‌ర్‌రెడ్డిని ఏసీబీ మ‌రోసారి విచార‌ణ‌కు పిల‌వనుంద‌ని తెలిసింది. ఈ సారి వేం న‌రేంద‌ర్ రెడ్డిని అరెస్ట చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా […]

త్వ‌ర‌లో వేం న‌రేంద‌ర్ రెడ్డి అరెస్ట్‌!
X
ఓటుకు నోటు కేసులో ఏసీబీ వేగం పెంచింది. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను సోమ‌వారం అరెస్టుచేసిన ఏసీబీ, ప్ర‌స్తుతం ఈకేసులోమ‌రో కీల‌క వ్య‌క్తి జిమ్మిబాబు కోసం వేట ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన అత‌ను దొరికితే అరెస్టు త‌ప్ప‌ద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన వేం న‌రేంద‌ర్‌రెడ్డిని ఏసీబీ మ‌రోసారి విచార‌ణ‌కు పిల‌వనుంద‌ని తెలిసింది. ఈ సారి వేం న‌రేంద‌ర్ రెడ్డిని అరెస్ట చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. విచార‌ణ‌లో సండ్ర నోరు విప్ప‌క‌పోవ‌డంతో మ‌రింత స‌మాచారం సేక‌రించేందుకు ఏసీబీ అరెస్టుకు పూనుకుంది. అత‌న్ని నేడు న్యాయ‌స్థానంలో ప్ర‌వేశ‌పెట్టి త‌మ క‌స్ట‌డీకి కోరే అవ‌కాశ‌ముంది. అరెస్టైన తొలిరోజు కూడా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎలాంటి నోరు విప్ప‌ని సంగతి తెలిసిందే! కానీ, త‌రువాత విచార‌ణ‌లో త‌న‌కు తెలిసిన అన్ని విష‌యాలు వెల్ల‌డించాన‌ని రేవంత్ కోర్టుకు పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌లో పేర్కొన్న సంగ‌తి విదిత‌మే. ఇదే వ్యూహాన్ని సండ్ర విష‌యంలోనూ మ‌రోసారి అమ‌లుచేస్తోంది ఏసీబీ. త‌మ ద‌గ్గరున్న ఆధారాల‌కు సండ్ర చెప్పే స‌మాధానాలు కేసును కీల‌క మ‌లుపు తిప్పుతాయ‌ని భావిస్తోంది. అందుకే అత‌న్నిఅరెస్టు చేసింది. ఇక త‌రువాత వ్య‌క్తి వేం న‌రేంద‌ర్ రెడ్డి. ఇత‌నిని కూడా అరెస్ట్‌ చేస్తే ఇద్ద‌రిని క‌లిపి విచారిస్తే కొత్త విష‌యాలు వెల్ల‌డి కావ‌చ్చ‌ని ఏసీబీ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.
First Published:  6 July 2015 9:41 PM GMT
Next Story