Telugu Global
Others

చేసిన పనులపై శ్వేతపత్రానికై పొన్నం డిమాండ్‌

కల్లబొల్లి కబుర్లతో కాలం నెట్టుకొస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తిరుగులేదనే రీతిలో వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు ఎదురుతిరిగే రోజు దగ్గర్లోనే ఉందని జోస్యం చెప్పారు. ఏడాది పాలనలో హామీలు గుప్పించారు తప్ప ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని పొన్నం విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనుల […]

కల్లబొల్లి కబుర్లతో కాలం నెట్టుకొస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తిరుగులేదనే రీతిలో వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు ప్రజలు ఎదురుతిరిగే రోజు దగ్గర్లోనే ఉందని జోస్యం చెప్పారు. ఏడాది పాలనలో హామీలు గుప్పించారు తప్ప ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని పొన్నం విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనుల లెక్క చెప్పాలని ఆయన డిమాండు చేశారు.
First Published:  6 July 2015 1:18 PM GMT
Next Story