Telugu Global
Others

ఒకే దెబ్బ‌కు ఎన్నో పిట్ట‌లు -కేసీఆర్ వ్యూహం

తెలంగాణ ప్ర‌భుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వ‌ర్‌ను మంత్రిని చేస్తాన‌న్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. స‌రిగ్గా నెల‌రోజుల క్రితం రాష్ట్ర సాంస్కృతిక సంస్థ‌ చైర్మ‌న్ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు కూడా కేసీఆర్ ఇదే ర‌క‌మైన ఆఫ‌ర్ ఇచ్చారు. బ‌హిరంగ స‌భా వేదిక‌ల‌పై కేసీర్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డ‌మేమిటి? మ‌ంత్రివ‌ర్గ‌మ‌నేది ఆయ‌నిష్ట‌మే కానీ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ల ఆంత‌ర్య‌మేమిటి? అనే దానిపై ఇపుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చకు దారితీసింది. కొప్పుల ఈశ్వ‌ర్‌, బాల‌కిష‌న్ ఇద్ద‌రూ క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన […]

ఒకే దెబ్బ‌కు ఎన్నో పిట్ట‌లు -కేసీఆర్ వ్యూహం
X
తెలంగాణ ప్ర‌భుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వ‌ర్‌ను మంత్రిని చేస్తాన‌న్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. స‌రిగ్గా నెల‌రోజుల క్రితం రాష్ట్ర సాంస్కృతిక సంస్థ‌ చైర్మ‌న్ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు కూడా కేసీఆర్ ఇదే ర‌క‌మైన ఆఫ‌ర్ ఇచ్చారు. బ‌హిరంగ స‌భా వేదిక‌ల‌పై కేసీర్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డ‌మేమిటి? మ‌ంత్రివ‌ర్గ‌మ‌నేది ఆయ‌నిష్ట‌మే కానీ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ల ఆంత‌ర్య‌మేమిటి? అనే దానిపై ఇపుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చకు దారితీసింది. కొప్పుల ఈశ్వ‌ర్‌, బాల‌కిష‌న్ ఇద్ద‌రూ క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే. ఇదే జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు కేబినెట్‌లో ఉన్నారు. ఒక జిల్లా నుంచి న‌లుగురికి కేబినెట్‌లో అవ‌కాశ‌మిస్తారా అన్న‌ది అనుమాన‌మే. పోనీ ఆ ఇద్ద‌రినీ తీసేసి ఈ ఇద్ద‌రికీ అవ‌కాశ‌మిస్తారా అంటే అందుకు అవ‌కాశాలు లేనే లేవు. ఇందులో కొప్పుల ఈశ్వ‌ర్ మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు. ర‌స‌మ‌యి మాల సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు. కేబినెట్‌లో ఉన్న ఏకైక ఎస్సీనేత క‌డియం శ్రీ‌హ‌రి ఇటీవ‌లే మంత్రిప‌ద‌వితో పాటు డిప్యూటీ సీఎం హోదా అందుకున్నారు. ఇంత త్వ‌ర‌గా ఆయ‌న‌కు ఉద్వాస‌న ప‌లుకుతార‌ని భావించ‌లేం. అందువ‌ల్ల ఎలాంటి స‌మీక‌ర‌ణాలు బేరీజు వేసుకున్నా కేబినెట్‌లో కొత్త‌వారికి చాన్సే లేదు. అయినా కేసీఆర్ ఇలా ఎందుకు ప్ర‌క‌టించార‌నేది అంతుప‌ట్ట‌ని విష‌య‌మేమీ కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. స‌రిగా ప‌నిచేయ‌ని మంత్రుల‌కు హెచ్చ‌రిక‌లు పంపించ‌డం, మిగిలిన మంత్రుల‌నూ ఒళ్లుద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించ‌డం కేసీఆర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అంతేకాదు. ప‌ద‌వులు రాలేద‌ని బాధ‌ప‌డుతున్న‌నాయ‌కుల‌కు కేసీఆర్ వ్యాఖ్య‌లు టానిక్‌లా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే ఏదో ఒక నాటికి మ‌న‌కూ గుర్తింపు వ‌స్తుంద‌ని, తామూ రేసులో ఉంటామ‌ని భావిస్తూ వారు అంకిత‌భావంతో ప‌నిచేస్తారు. ఇలా ఒకే దెబ్బ‌కు అనేక పిట్ట‌లు కొట్ట‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది త‌ప్ప ఇప్ప‌ట్లో కేబినెట్‌ను మార్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
First Published:  6 July 2015 9:47 PM GMT
Next Story