Telugu Global
Cinema & Entertainment

పటాస్ దారిలోనే షేర్

కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మరపురాని చిత్రం పటాస్. అప్పుడెప్పుడో సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా తర్వాత పటాస్ మాత్రమే కల్యాణ్ రామ్ కు కిక్ ఇవ్వగలిదింది. ఇప్పుడదే ఊపులో షేర్ అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు కల్యాణ్ రామ్. ప్రతిసారి తన సొంత బ్యానర్ లో మాత్రమే సినిమాలు చేసే కల్యాణ్ రామ్, ఈసారి వెంకటేశ్ అనే ప్రొడ్యూసర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. షేర్ సినిమాకు మల్లికార్జున దర్శకుడు. సోనాల్ చౌహాన్ […]

పటాస్ దారిలోనే షేర్
X
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మరపురాని చిత్రం పటాస్. అప్పుడెప్పుడో సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా తర్వాత పటాస్ మాత్రమే కల్యాణ్ రామ్ కు కిక్ ఇవ్వగలిదింది. ఇప్పుడదే ఊపులో షేర్ అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు కల్యాణ్ రామ్. ప్రతిసారి తన సొంత బ్యానర్ లో మాత్రమే సినిమాలు చేసే కల్యాణ్ రామ్, ఈసారి వెంకటేశ్ అనే ప్రొడ్యూసర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. షేర్ సినిమాకు మల్లికార్జున దర్శకుడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లింది సినిమా యూనిట్. కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదల చేసిన స్టిల్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఖుషీగా ఉంది షేర్ టీం. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించడం మరో ప్లస్ పాయింట్. తాజా సమాచారం ప్రకారం.. షేర్ మూవీ కూడా పటాస్ దారిలోనే ఉండబోతోందని తెలుస్తోంది. అంటే.. పటాస్ లానే షేర్ లో కూడా కల్యాణ్ రామ్ అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడట. ప్రస్తుతం కథలన్నీ ఇదే బాటలో నడుస్తున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ కూడా అలాంటి కథతోనే షేర్ సినిమాలో నటిస్తున్నాడని సమాచారం. ఈ నెలాఖరుకు షేర్ ఆడియో విడుదల చేసి వచ్చే నెలలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.
First Published:  6 July 2015 7:02 PM GMT
Next Story