Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 136

రాజేష్‌ : అడ్వర్‌టైజ్‌మెంట్ల వల్ల నాకు బాగా ఖర్చవుతోంది. వెంకట్‌ : నువ్వు ఏ అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేసినట్లు నా దృష్టికి రాలేదే! రాజేష్‌ : నేను చెయ్యలేదు కానీ ఇతర్లు చేసిన బోలెడు అడ్వర్‌టైజ్‌మెంట్లు మా ఆవిడ చూస్తోంది. ————————————————- జనాభా లెక్కలతను వచ్చి ఆమె వయసడిగాడు. ఆమె : సరే చెబుతాను వినండి. నాకు పెళ్ళయినప్పుడు 18 ఏళ్ళు. అప్పుడు మా ఆయన వయసు 30 ఏళ్ళు. ఇప్పుడాయన వయసు 60 ఏళ్ళు. అంటే ఆయన […]

రాజేష్‌ : అడ్వర్‌టైజ్‌మెంట్ల వల్ల నాకు బాగా ఖర్చవుతోంది.
వెంకట్‌ : నువ్వు ఏ అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేసినట్లు నా దృష్టికి రాలేదే!
రాజేష్‌ : నేను చెయ్యలేదు కానీ ఇతర్లు చేసిన బోలెడు అడ్వర్‌టైజ్‌మెంట్లు మా ఆవిడ చూస్తోంది.
————————————————-
జనాభా లెక్కలతను వచ్చి ఆమె వయసడిగాడు.
ఆమె : సరే చెబుతాను వినండి. నాకు పెళ్ళయినప్పుడు 18 ఏళ్ళు.
అప్పుడు మా ఆయన వయసు 30 ఏళ్ళు. ఇప్పుడాయన వయసు 60 ఏళ్ళు. అంటే ఆయన వయసు అప్పటి వయసుతో పోలిస్తే రెండింతలయింది. నా వయసూ రెండింతలయింది. నాకిప్పుడు 36 ఏళ్ళు.
————————————————-
ఒక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేసే అమ్మాయి సెలవు కావాలని అప్తై చేసింది. మేనేజర్‌ “ఎందుకు?” అని అడిగాడు.
ఆ అమ్మాయి “నా అందం తగ్గిపోతోందని సందేహంగా ఉందండి. ఎందుకంటే నేను చిల్లర ఇస్తే అందరూ లెక్కపెట్టుకుంటున్నారు” అంది.

First Published:  6 July 2015 1:03 PM GMT
Next Story