Telugu Global
Others

మొబైల్ నుంచే బ‌ర్త్ స‌ర్టిఫికెట్ డౌన్‌లోడ్‌

జ‌న‌న, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌తోపాటు భూమికి సంబంధించిన అడంగ‌ల్ కాపీల‌ను సెల్‌ఫోన్ ద్వారా డౌన్ లౌడ్ చేసుకునే మొబైల్ యాప్‌ను ఐటీ మంత్రి కే.తార‌క‌రామారావు ఆవిష్క‌రించారు. డిజిట‌ల్ తెలంగాణ పై జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఫైనాన్స్ వ‌ర్శిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేటీఆర్ మ‌రో మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డితో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మొబైల్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌ల‌కు పౌర‌సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని తెలిపారు. మీ సేవ కార్యాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు […]

జ‌న‌న, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌తోపాటు భూమికి సంబంధించిన అడంగ‌ల్ కాపీల‌ను సెల్‌ఫోన్ ద్వారా డౌన్ లౌడ్ చేసుకునే మొబైల్ యాప్‌ను ఐటీ మంత్రి కే.తార‌క‌రామారావు ఆవిష్క‌రించారు. డిజిట‌ల్ తెలంగాణ పై జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఫైనాన్స్ వ‌ర్శిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేటీఆర్ మ‌రో మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డితో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మొబైల్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌ల‌కు పౌర‌సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌ని తెలిపారు. మీ సేవ కార్యాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న 321 పౌర‌సేవ‌ల్లో ప్ర‌స్తుతానికి మూడింటిని మొబైల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే వీలు క‌ల్పిస్తున్నామ‌ని, భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని సేవ‌లందిస్తామ‌ని అన్నారు.

First Published:  6 July 2015 1:13 PM GMT
Next Story