Telugu Global
Others

బాబు కేబినెట్ నుంచి ముగ్గురు ఔట్‌,  ఆరుగురికి చోటు

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాల‌ని భావిస్తున్నారు. ఈనెల 25 క‌ల్లా గోదావ‌రి పుష్క‌రాలు ముగియ‌నున్నాయి. ఆ త‌ర్వాత మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు. ముగ్గురిని తొల‌గించి ఆరుగురికి కొత్త‌గా కేబినెట్‌లో స్థానం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలంటున్నాయి. ఎవ‌రిని చేర్చుకోవాలి? ఎవ‌రికి ఉద్వాస‌న ప‌ల‌కాల‌నేదానిపై చంద్ర‌బాబు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తి చేశార‌ని ఆ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల ప‌నితీరుపై అంత‌ర్గ‌త స‌ర్వేలు నిర్వ‌హించిన చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ […]

బాబు కేబినెట్ నుంచి ముగ్గురు ఔట్‌,  ఆరుగురికి చోటు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాల‌ని భావిస్తున్నారు. ఈనెల 25 క‌ల్లా గోదావ‌రి పుష్క‌రాలు ముగియ‌నున్నాయి. ఆ త‌ర్వాత మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు. ముగ్గురిని తొల‌గించి ఆరుగురికి కొత్త‌గా కేబినెట్‌లో స్థానం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలంటున్నాయి. ఎవ‌రిని చేర్చుకోవాలి? ఎవ‌రికి ఉద్వాస‌న ప‌ల‌కాల‌నేదానిపై చంద్ర‌బాబు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తి చేశార‌ని ఆ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల ప‌నితీరుపై అంత‌ర్గ‌త స‌ర్వేలు నిర్వ‌హించిన చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ పూర్తిస్థాయి నివేదిక‌లు అందించార‌ని, ఆరుగురు మంత్రుల ప‌నితీరు బాగోలేద‌ని ఆ నివేదిక‌ల‌లో ఉంద‌ని చంద్ర‌బాబు స‌న్నిహితులు చెబుతున్నారు. ఆ ఆరుగురిలో ముగ్గురు మాత్రం తొల‌గించాల్సిన జాబితాలో ముందున్నార‌ట‌. ప‌నితీరు బాగోలేక‌పోవ‌డ‌మే కాక అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారి పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఇక కేబినెట్‌లో చేర‌నున్న వారి విష‌యానికొస్తే… చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన ఎంఎ ష‌రీఫ్ చేరిక ఖాయంగా క‌నిపిస్తుంది. ఆయ‌న ఇటీవ‌లే ఎంఎల్‌సీగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌తోపాటు ఎంఎల్‌సీలుగా ఎన్నికైన ప‌య్యావుల కేశ‌వ్‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డికి కూడా మంత్రివ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశ‌ముంది. ఈ న‌లుగురూ ఇటీవ‌లే గ‌వ‌ర్న‌ర్‌, స్థానిక సంస్థ‌ల కోటాల‌లో ఎంఎల్‌సీలుగా ఎన్నిక‌య్యారు. అయితే తోట త్రిమూర్తులు, క‌ళావెంక‌ట్రావు, బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కుల స‌మీక‌ర‌ణ‌ల‌ను బేరీజు వేసుకుని చంద్ర‌బాబు తుది జాబితా త‌యారు చేస్తార‌ని అంటున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి రెండు, రెడ్ల సామాజిక వ‌ర్గానికి రెండు, ఎస్సీకి ఒక‌టి ఎస్టీకి ఒక‌టి కేబినెట్ బెర్త్‌లు కేటాయించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కేబినెట్‌లో ఇంధ‌నం, ప‌రిశ్ర‌మ‌లు, టూరిజం, న్యాయ‌శాఖ‌, మౌలిక‌స‌దుపాయాలు, నౌకాశ్ర‌యాల వంటి కీల‌క‌మైన శాఖ‌లు ఖాళీగా ఉన్నాయి. కొత్త‌గా తీసుకునే మంత్రుల‌కు ఈ శాఖ‌లు కేటాయించే అవ‌కాశం ఉంది.
First Published:  6 July 2015 11:32 PM GMT
Next Story