Telugu Global
NEWS

ఏపీలో ఆరుగురు కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం!

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరు తాడిపర్రులో అనాదిగా సాగుచేసుకుంటున్న భూములు త‌మ‌కు కాకుండా పోతున్నాయ‌నే బాధ‌తో ఆరుగురు కౌలు రైతులు పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేశారు. ఇది తెలిసి త‌ట్టుకోలేని మాజీ స‌ర్పంచ్ గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ భూములు లాక్కునే ప్ర‌యత్నం అధికారులు ఇంత‌కుముందు కూడా చేశారు. ఈ వివాదానికి సంబంధించి బాధిత రైతులే సిసిఎల్‌ఎ కోర్టును ఆశ్రయించారు. తదుపరి తీర్పు చెప్పే వరకూ. ఇరుపక్షాల వారు ఆ భూముల్లోకి వెళ్ళరాదని సంబంధిత […]

ఏపీలో ఆరుగురు కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం!
X
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరు తాడిపర్రులో అనాదిగా సాగుచేసుకుంటున్న భూములు త‌మ‌కు కాకుండా పోతున్నాయ‌నే బాధ‌తో ఆరుగురు కౌలు రైతులు పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేశారు. ఇది తెలిసి త‌ట్టుకోలేని మాజీ స‌ర్పంచ్ గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ భూములు లాక్కునే ప్ర‌యత్నం అధికారులు ఇంత‌కుముందు కూడా చేశారు. ఈ వివాదానికి సంబంధించి బాధిత రైతులే సిసిఎల్‌ఎ కోర్టును ఆశ్రయించారు. తదుపరి తీర్పు చెప్పే వరకూ. ఇరుపక్షాల వారు ఆ భూముల్లోకి వెళ్ళరాదని సంబంధిత కోర్టు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను కూడా ధిక్కరించి ఆలయ అధికారులు పోలీసు రక్షణతో గత సీజన్‌లో భూముల మీద ఉన్న వరి పంటను సైతం దౌర్జన్యంగా కోత కోయించి వేలం పాటదారులకు అప్పగించారు. మళ్లీ ఆ భూములనే రెండో సీజ‌న్‌లో వేలం వేసేందుకు దేవస్థానం ఇఓ ఆధ్వర్యంలో అధికారులు సన్నద్ధమయ్యారు. పోలీసు బందోబస్తుతో గ్రామంలో భూములకు వేలం పాటలు నిర్వహిస్తుండగా అనాదిగా కౌలు చేసుకుంటున్న పేద రైతులు ఆ వేలాన్ని అడ్డుకున్నారు. పోలీసులతో వారిని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో.. కోరుతాడిపర్రు, వామనగుంటపాలెంకు చెందిన కౌలు రైతులు బోసుబాబు, డి.శివన్నారాయ‌ణ‌, నక్కా ఏడుకొండలు, ముద్రబోయిన సుబ్బమ్మ, గొడవర్తి నాగేశ్వరరావు, ఆలపాడుకు చెందిన స‌త్తెయ్యలు మనస్తాపంతో పురుగు మందు తాగి అక్కడికక్కడే పడిపోయారు. వీరిలో నలుగురిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి, మరో ఇద్దరిని తెనాలికి తరలించారు. ఈ ఘటన విష‌యం తెలిసిన తరువాత కోరుతాడిపర్రు మాజీ సర్పంచ్‌ రాములు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. రైతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌, అమృత‌లూరు మండల తహశీల్దార్‌ భూములకు వేలం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. వేలం పాటలు జరిగిన భూములు కోరు తాడిపర్రులో ఉన్న చెన్నకేశవస్వామి దేవస్థానానికి సంబంధించినవని దేవస్థానం అధికారులు వాదిస్తుండగా, అవి ఎస్టేట్‌వని, పేదలమైన తాము 90 సంవ‌త్సరాల నుంచీ సాగు చేసుకుంటున్నామని రైతులు మరోవైపు వాదిస్తున్నారు. చినికిచినికి గాలివానగా మారిన ఈ వివాదం ఎంత‌మందిని బ‌లి తీసుకుంటుందోన‌ని గ్రామ‌స్థులు ఆందోళ‌న చెందుతున్నారు.
First Published:  7 July 2015 4:49 AM GMT
Next Story