Telugu Global
Cinema & Entertainment

రాజ‌మౌళి హాలీవుడ్ కు వెళ్లిపోతాడా..?

ద‌ర్శ‌కుల్లో   ఒక ఉత్త‌మ మైన శిల్పి రాజ‌మౌళి  అనే విష‌యం మ‌న తెలుగు అభిమానుల‌కు..ఈగ చిత్రంతో ద‌క్షిణాది అభిమాన‌ల‌కు తెలిసిన విష‌యమే. మ‌రి బాహుబ‌లి తో  దేశం అంతా త‌న ప్ర‌తిభ‌ను చాటుబోతున్నాడు.  ఇప్ప‌టికే బాలీవుడ్ లో  ఈ సినిమాకు  వీప‌రీత‌మైన హైప్ వ‌చ్చేసింది. మ‌న రాజ‌మౌళి కాబ‌ట్టి. వ‌ర‌స స‌క్సెస్ ల‌తో  వున్న ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి..ఆయ‌న ప‌నిత‌నం మీద మ‌న‌కు ప్ర‌పంచంలో  అంద‌రికంటే ఎక్కువ ఒక గ్రాము న‌మ్మ‌కం ఎక్కువ వుంటుంది.   ఈగ […]

రాజ‌మౌళి హాలీవుడ్ కు వెళ్లిపోతాడా..?
X
ద‌ర్శ‌కుల్లో ఒక ఉత్త‌మ మైన శిల్పి రాజ‌మౌళి అనే విష‌యం మ‌న తెలుగు అభిమానుల‌కు..ఈగ చిత్రంతో ద‌క్షిణాది అభిమాన‌ల‌కు తెలిసిన విష‌యమే. మ‌రి బాహుబ‌లి తో దేశం అంతా త‌న ప్ర‌తిభ‌ను చాటుబోతున్నాడు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ఈ సినిమాకు వీప‌రీత‌మైన హైప్ వ‌చ్చేసింది. మ‌న రాజ‌మౌళి కాబ‌ట్టి. వ‌ర‌స స‌క్సెస్ ల‌తో వున్న ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి..ఆయ‌న ప‌నిత‌నం మీద మ‌న‌కు ప్ర‌పంచంలో అంద‌రికంటే ఎక్కువ ఒక గ్రాము న‌మ్మ‌కం ఎక్కువ వుంటుంది.
ఈగ సినిమా మేకింగ్ తో ప్ర‌పంచానికి క‌నెక్ట్ అయిన రాజ‌మౌళి… బాహుబ‌లి సినిమా మేకింగ్ తో ప్ర‌పంచ సినిమా కు త‌ల‌మాన‌కం అయిన హాలీవుడ్ కు వెళ్తాడా..? నిజ‌మే వెళ్లోచ్చు అంటున్నారు బాహుబ‌లి క‌థానాయ‌కుడు ప్ర‌భాస్. రాజ‌మౌళి కి అత్యంత స‌న్నిహితుడు.. ఆయ‌న డైరెక్ష‌న్ లో ఛ‌త్ర‌ప‌తి వంటి హిట్ అందుకున్న హీరో.. ఆ త‌రువాత నుంచి ఇద్ద‌రు జిగిరి దోస్తులు అయ్యారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాజ‌మౌళి గురించి ఏం చెప్పాడో ఆడియో విడుద‌ల వేడుక‌లో విన్నాం. నాకు గురువు, అత్యంత స‌న్నిహితుడు..ఒక్క మాట‌లో చెప్పాలంటే..సోల్ మేట్ అని క్లారీటి ఇచ్చారు. ఇక బాహుబ‌లి మేకింగ్ దాదాపు మూడు సంవ‌త్స‌రాలు క‌ల‌సి చేశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ప‌ని త‌నం ఎలా వుంటుందో ద‌గ్గ‌రుండి గ‌మ‌నించారు.బాహుబ‌లి విజ‌న‌రీ రాజ‌మౌళి … ఆయ‌న అనుకున్న దానికంటే అద్భుతుంగా సినిమాను తెర‌కెక్కించే ప్ర‌తిభా వంతుడు. కాబ‌ట్టి.. మ‌న తెలుగు సినిమా కాదు..ఇండియన్ ద‌క్షిణాది సినిమా వ‌ర‌కు జేమ్స్ కామ‌రూన్ అంతటి వాడు అన‌డం అతిశ‌యోక్తి కాదు. ఇండియ‌న్ సినిమా ను వ‌దిలి రాజ‌మౌళి బాహుశ హాలీవుడ్ కు వెళ్ల‌క పోవ‌చ్చు.
First Published:  6 July 2015 4:56 AM GMT
Next Story