Telugu Global
CRIME

భర్త రేప్ చేస్తుంటే... భార్య వీడియో చిత్రీకరణ!

భర్త అత్యాచారం చేస్తుంటే… భార్య ఆ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించడం… వినడానికి అసహ్యంగాను, ఆశ్చర్యంగాను ఉన్నా ఇది నిజం. ఇండోర్‌లోని సీజర్స్‌ ఆర్ట్‌ బ్యూటీ పార్లర్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బంటీవర్మ, రింకూవర్మ భార్యాభర్తలు. చక్కగా ఓ బ్యూటీ పార్లర్‌ పెట్టుకున్నారు. మగాళ్ళకి బంటీవర్మ, ఆడోళ్ళకి రింకూవర్మ బ్యూటీ విభాగాల వద్ద ఇన్‌ఛార్జిలుగా ఉంటారు. ఈ పార్లర్‌లో పని చేసే 19 యేళ్ళ ఓ యువతి వీరి కంట పడింది. ఓ రోజు ఆమెకు […]

భర్త రేప్ చేస్తుంటే... భార్య వీడియో చిత్రీకరణ!
X
భర్త అత్యాచారం చేస్తుంటే… భార్య ఆ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించడం… వినడానికి అసహ్యంగాను, ఆశ్చర్యంగాను ఉన్నా ఇది నిజం. ఇండోర్‌లోని సీజర్స్‌ ఆర్ట్‌ బ్యూటీ పార్లర్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బంటీవర్మ, రింకూవర్మ భార్యాభర్తలు. చక్కగా ఓ బ్యూటీ పార్లర్‌ పెట్టుకున్నారు. మగాళ్ళకి బంటీవర్మ, ఆడోళ్ళకి రింకూవర్మ బ్యూటీ విభాగాల వద్ద ఇన్‌ఛార్జిలుగా ఉంటారు. ఈ పార్లర్‌లో పని చేసే 19 యేళ్ళ ఓ యువతి వీరి కంట పడింది. ఓ రోజు ఆమెకు తెలియకుండా కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపారు. అది తాగిన ఈ యువతి మైకంలోకి వెళ్లిపోయింది. ఇది అదనుగా తీసుకుని బంటీ అసభ్యంగా ఆమెను చిత్రీకరించాడు. ఆ తర్వాత అది చూపించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో బంటీ శృంగారం చేస్తున్నప్పుడు అతని భార్య రింకూవర్మ దాన్ని వీడియో చిత్రీకరించింది. ఇది చూపించి తర్వాత ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలెట్టారు. మగాళ్ళ బ్యూటీ పార్లర్‌ విభాగంలో పని చేయమని ఆమెను ఒత్తిడి చేశారు. ససేమిరా అన్న ఈ యువతిని బెదిరిస్తూ సదరు వీడియో ఇంటర్‌నెట్‌లోను, వాట్స్‌ప్‌లోను పెట్టి అందరిలోనూ నవ్వులపాలు చేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులతో విసిగిపోయిన ఆ యువతి శుక్రవారం విషం తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎందుకిలా చేశావని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన బాగోతానంతా ఆమె పూసగుచ్చినట్టు వివరించింది. దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి ఆ భార్యభర్తలతోపాటు ఈ క్రతువులో భాగస్వాములైన రింకూ సోదరుడు సూరజ్‌, మరిది లోకేంద్ర, అక్కడ పని చేసే రాజ్‌లను అరెస్ట్‌ చేసినట్టు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆప్‌ పోలీస్‌ దేవేంద్ర పటిదార్‌ చెప్పారు.
First Published:  4 July 2015 7:40 PM GMT
Next Story