Telugu Global
Others

స్థానిక సంస్థ‌ల‌పై ఆర్టీసీ న‌ష్ట భారం 

ఆర్టీసీ న‌ష్టాల భారాన్ని స్థానిక సంస్థ‌ల‌కు పంచాల‌ని తెలంగాణ‌ స‌ర్కార్ నిర్ణ‌యించింది.  ఈ నిర్ణ‌యం ద్వారా ఆర్టీసీకి ఆర్థిక చేయూత ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.  గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ పరిధిలో ఆర్టీసీకి న‌ష్టాలు ఎక్కువగా వ‌స్తోన్న‌ట్టు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గుర్తించింది. గ‌తేడాది హైద‌రాబాద్ సిటీ జోన్ ప‌రిధిలో రూ. 210 కోట్లు, వ‌రంగ‌ల్ జోన్ ప‌రిధిలో రూ. 60 నుంచి 70 కోట్ల మేర ఆర్టీసీ న‌ష్టాలు చ‌వి చూసింది.  అందుకే ఆయా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు […]

ఆర్టీసీ న‌ష్టాల భారాన్ని స్థానిక సంస్థ‌ల‌కు పంచాల‌ని తెలంగాణ‌ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యం ద్వారా ఆర్టీసీకి ఆర్థిక చేయూత ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ పరిధిలో ఆర్టీసీకి న‌ష్టాలు ఎక్కువగా వ‌స్తోన్న‌ట్టు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గుర్తించింది. గ‌తేడాది హైద‌రాబాద్ సిటీ జోన్ ప‌రిధిలో రూ. 210 కోట్లు, వ‌రంగ‌ల్ జోన్ ప‌రిధిలో రూ. 60 నుంచి 70 కోట్ల మేర ఆర్టీసీ న‌ష్టాలు చ‌వి చూసింది. అందుకే ఆయా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు ఆర్టీసీ న‌ష్ట భారాన్ని పంచ‌డంతోపాటు గ్రేట‌ర్ కార్పోరేష‌న్ బ‌డ్జెటులో ఏటా ఆర్టీసీకి కొన్ని నిధులు కేటాయింపులు చేసేందుకు వీలుగా సీఎం క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ పాల‌క‌వ‌ర్గంలో స‌భ్యుడుగా న‌గ‌ర పాల‌క‌ క‌మిష‌న‌ర్‌ను చేర్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆర్టీసీ విభ‌జ‌న ఇప్ప‌టికే జ‌రిగినందున త్వ‌ర‌లో బోర్డు నియామ‌కాల‌కు కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌నుంది.
First Published:  3 July 2015 1:08 PM GMT
Next Story