Telugu Global
Cinema & Entertainment

సల్మాన్ కు పోటీగా నిలిచిన కంగనా రనౌత్

బాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలైంది తను వెడ్స్ మను-2. కానీ సినిమా చిన్నదైనప్పటికీ మూవీపై అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఆ అంచనాలతో పాటు సినిమా సర్ ప్రైజింగ్ గా ఉండడంతో పార్ట్-2 కూడా అఖండ విజయం సాధించింది. ఓ మోస్తరు వసూళ్లు సాధిస్తుందనుకున్న తను వెడ్స్ మను -2 చూస్తుండగానే బిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. అలవోకగా వందకోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇదే గొప్ప విషయం అనుకుంటున్న టైమ్ లో ఏకంగా 150కోట్ల […]

సల్మాన్ కు పోటీగా నిలిచిన కంగనా రనౌత్
X
బాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలైంది తను వెడ్స్ మను-2. కానీ సినిమా చిన్నదైనప్పటికీ మూవీపై అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఆ అంచనాలతో పాటు సినిమా సర్ ప్రైజింగ్ గా ఉండడంతో పార్ట్-2 కూడా అఖండ విజయం సాధించింది. ఓ మోస్తరు వసూళ్లు సాధిస్తుందనుకున్న తను వెడ్స్ మను -2 చూస్తుండగానే బిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. అలవోకగా వందకోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇదే గొప్ప విషయం అనుకుంటున్న టైమ్ లో ఏకంగా 150కోట్ల రూపాయల బెంచ్ మార్క్ ను అందుకుంది ఈ సినిమా. దీంతో అవాక్కయిపోవడం సినిమా జనాల వంతయింది. బాలీవుడ్ లో ఇది ఏ స్థాయిలో ఆడుతోందంటే.. ఇదే ఊపు మరో వారం రోజులు కొనసాగితే.. ఏకంగా సల్మాన్ నటించిన దబాంగ్-2 సినిమా రికార్డును తనువెడ్స్ మను-2 క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కథలో దమ్ముంటే హీరోయిజం అక్కర్లేదనే విషయాన్ని ఈ తాజా సీక్వెల్ మరోసారి రుజువుచేసింది. మాధవన్ యాక్టింగ్ కు, కంగనారనౌత్ క్యారెక్టరైజేషన్ తోడవ్వడంతో తనువెడ్స్ మను-2 సినిమా ఇప్పటికీ స్టడీగా వసూళ్లు సాధిస్తోంది.
First Published:  4 July 2015 2:28 AM GMT
Next Story