Telugu Global
International

భారత్‌ లో బాకీ... 1000 కోట్ల అమెరికా భూమి జప్తు

భార‌త్‌లో బ్యాంకును మోసం చేసి అమెరికాలో ఆస్తుల‌ను కూడా బెట్టిన ఓ బ‌డా వ్యాపారికి విచార‌ణ సంస్థ దిమ్మ తిరిగే ప‌రిస్థితి క‌ల్పించింది. అలహాబాద్‌: బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేసిన ఒక వ్యాపారికి సంబంధించిన కేసులో… అమెరికాలోని 1,280 ఎకరాల స్థలాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జప్తు చేసింది. నిందితులు భార‌త్ సొమ్ముతో విదేశాల్లో పోగేసిన ఆస్తుల జప్తునకు ఈడి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఇదే మొదటిసారి. ఇడి జప్తు చేసిన భూమి విలువ 1,000 […]

భారత్‌ లో బాకీ... 1000 కోట్ల అమెరికా భూమి జప్తు
X
భార‌త్‌లో బ్యాంకును మోసం చేసి అమెరికాలో ఆస్తుల‌ను కూడా బెట్టిన ఓ బ‌డా వ్యాపారికి విచార‌ణ సంస్థ దిమ్మ తిరిగే ప‌రిస్థితి క‌ల్పించింది. అలహాబాద్‌: బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేసిన ఒక వ్యాపారికి సంబంధించిన కేసులో… అమెరికాలోని 1,280 ఎకరాల స్థలాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జప్తు చేసింది. నిందితులు భార‌త్ సొమ్ముతో విదేశాల్లో పోగేసిన ఆస్తుల జప్తునకు ఈడి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఇదే మొదటిసారి. ఇడి జప్తు చేసిన భూమి విలువ 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ స్థలం బ్యాంకు రుణ మోసం కేసులతో సంబంధం ఉన్న జూమ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాని ప్రమోటర్‌ విజయ్‌ చౌధురికి సంబంధించిందని ఈడి అలహాబాద్‌: యూనిట్‌ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ స్థలాన్ని జప్తు చేసినట్టు చెప్పారు. జూమ్‌ డెవలపర్స్‌ ప్రమోటర్‌ విజయ్‌ చౌధురి… యూరప్‌లో రియల్టీ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు బ్యాంకులను నమ్మించి 2,200 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. బ్యాంకులిచ్చిన సొమ్మును దారి మళ్లించినట్టుగా త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో బ‌య‌ట‌ప‌డింది. ఈ సొమ్మునే విదేశాలకు అక్రమంగా తరలించి కాలిఫోర్నియాలో 1,280 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు ఈడి వర్గాలు గుర్తించాయి. ఈడీ క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన‌ విజయ్‌ చౌధురి అందుబాటులో లేకుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు. కంపెనీ డైరెక్టర్‌ శరద్‌ కబ్రా మాత్రం ఇండోర్‌ ఇడి అధికారులకు చిక్కాడు. అడ్డ‌దిడ్డంగా రుణాలిచ్చిన బ్యాంకు పాత్రపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నిజాయితీపై కూడా సందేహాలుండ‌డంతో ఈడీ ఈ కోణంలోకూడా దృష్టి పెట్టింది.
First Published:  3 July 2015 9:15 PM GMT
Next Story