Telugu Global
Others

ట్రైనీతో సహా ఉద్యోగులంతా ఈఎస్ఐకు అర్హులే

ట్రైనీ అయిన‌ప్ప‌టికీ హోదాల‌తో నిమిత్తం లేకుండా సంస్థలు, కంపెనీల్లో ప‌ని చేసే ప్ర‌తి ఉద్యోగీ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) ప్ర‌యోజ‌నాలు పొందేందుకు అర్హుడేన‌ని  హైకోర్టు స్ప‌ష్టం చేసింది. తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దిలీప్ బి. బొస్లే, న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఖండ‌వ‌ల్లి చంద్ర‌భాను, జ‌స్టిస్ ఎస్‌.వి.భ‌ట్‌, జ‌స్టిస్ ఎ.శంక‌ర నారాయ‌ణ‌, జ‌స్టిస్ అనిస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం శుక్ర‌వారం ఈ తీర్పును వెలువ‌రించింది.  ఆర్‌సీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప‌ని చేసే ట్రైనీ ఈఎస్ఐ కింద ల‌భించే […]

ట్రైనీ అయిన‌ప్ప‌టికీ హోదాల‌తో నిమిత్తం లేకుండా సంస్థలు, కంపెనీల్లో ప‌ని చేసే ప్ర‌తి ఉద్యోగీ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) ప్ర‌యోజ‌నాలు పొందేందుకు అర్హుడేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దిలీప్ బి. బొస్లే, న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ఖండ‌వ‌ల్లి చంద్ర‌భాను, జ‌స్టిస్ ఎస్‌.వి.భ‌ట్‌, జ‌స్టిస్ ఎ.శంక‌ర నారాయ‌ణ‌, జ‌స్టిస్ అనిస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం శుక్ర‌వారం ఈ తీర్పును వెలువ‌రించింది. ఆర్‌సీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప‌ని చేసే ట్రైనీ ఈఎస్ఐ కింద ల‌భించే ప్ర‌యోజ‌నాలు పొందేందుకు అర్హుడేన‌ని 1997లో ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ 1998లో ఆర్‌సీసీ లిమిటెడ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. మొద‌ట ఈ వ్యాజ్యాన్ని సింగ‌ల్ జ‌డ్జి విచారించి, ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నానికి నివేదించారు. ఆ త‌ర్వాత ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నానికి అక్క‌డ నుంచి ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బెంచ్‌కు బ‌దిలీ అయింది. కేసు విచార‌ణ చేప‌ట్టిన ఈ బెంచ్… ప్రయివేట్ సంస్థలు, కంపెనీల్లో ప‌ని చేసే ప్ర‌తి ఉద్యోగీ (ట్రైనీ అయిన‌ప్ప‌టికీ) ఈఎస్ఐ ప్ర‌యోజ‌నాలు పొందేందుకు అర్హుడ‌ని తీర్పు నిచ్చింది.
First Published:  3 July 2015 1:12 PM GMT
Next Story