Telugu Global
NEWS

ఏపీలో ప్ర‌భుత్వ ఉత్త‌ర‌ప్ర‌త్యురాలు ఇక ఈ-మెయిల్‌లోనే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ మూడు విష‌యాల‌పై దృష్టి పెట్టింది. ఇక నుంచి ప్ర‌భుత్వ ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాల‌న్నీ ప్ర‌త్యేకంగా రూపొందించే ఈ-మెయిల్ వ్య‌వ‌స్థ ద్వారానే జ‌ర‌గాల‌ని, ఆధార్ కోసం ఏవిషయంలోను ద‌ర‌ఖాస్తుదారుల‌ను వేధించ కూడ‌ద‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. నూతన ఈ-మెయిల్‌ విధానానికి శ‌నివారం జ‌రిగిన‌ కేబినెట్ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఈ-మెయిల్స్ ద్వారానే ఉత్త‌ర‌ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిపేలా చూడాల‌ని నిర్ణయించారు. దీంతో జూనియ‌ర్‌ అసిస్టెంట్‌ నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు ప్రభుత్వ ఈ-మెయిల్స్‌నే […]

ఏపీలో ప్ర‌భుత్వ ఉత్త‌ర‌ప్ర‌త్యురాలు ఇక ఈ-మెయిల్‌లోనే
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ మూడు విష‌యాల‌పై దృష్టి పెట్టింది. ఇక నుంచి ప్ర‌భుత్వ ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాల‌న్నీ ప్ర‌త్యేకంగా రూపొందించే ఈ-మెయిల్ వ్య‌వ‌స్థ ద్వారానే జ‌ర‌గాల‌ని, ఆధార్ కోసం ఏవిషయంలోను ద‌ర‌ఖాస్తుదారుల‌ను వేధించ కూడ‌ద‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. నూతన ఈ-మెయిల్‌ విధానానికి శ‌నివారం జ‌రిగిన‌ కేబినెట్ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఈ-మెయిల్స్ ద్వారానే ఉత్త‌ర‌ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిపేలా చూడాల‌ని నిర్ణయించారు. దీంతో జూనియ‌ర్‌ అసిస్టెంట్‌ నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు ప్రభుత్వ ఈ-మెయిల్స్‌నే ఉపయోగించాల్సి ఉంటుంది. తొలిదశలో ప్ర‌భుత్వం 40వేల మందికి ఈ-మెయిల్‌ సదుపాయం కల్పించనుంది. వీరెవరూ ఇక ముందు ప్రయివేటు ఈ-మెయిళ్ళను వాడవద్దని సూచించినట్టు తెలిసింది. వచ్చే ఏడాది నాటికి 2.5 లక్షల మంది ఉద్యోగులకు … ప్రభుత్వ ఈ-మెయిల్‌ సదుపాయం లభిస్తుంది. ఆధార్‌ విధానానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధార్ కోసం ప‌ట్టుప‌ట్ట‌వ‌ద్ద‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల‌ను మ‌నం గౌర‌వించాల‌ని, ఆధార్ లేని వారికి ఏఏ కార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న దానిపై కేబినెట్‌లో చర్చించారు. ప్రభుత్వంలోని అన్నిశాఖలు ఆధార్‌ను ఒకే విధంగా వినియోగించు కోవాలని నిర్ణయించారు. గుంటూరు కేంద్రంగా ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయ‌డానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో గత పదేళ్ళలో గృహ నిర్మాణంలో జరిగిన 4000 కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు శాసనసభా కమిటీని నియమించాలని, దీనిపై మరోసారి విజిలెన్స్‌ విభాగంతో విచారణ జరిపించాలని కేబినెట్‌ నిర్ణయించింది. పుష్కారాలు దగ్గర పడుతున్నా పనులు పూర్తి కాకపోవడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సందర్భంగా ఆయన దేవాదాయశాఖ పనితీరు సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. గోదావరి వద్ద నిత్య హారతి కార్యక్రమ నిర్వహణ పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఎంతో ఘనంగా నిర్వహించాలనుకున్న ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకోలేక పోయిందని ఆయన అన్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, భద్రత, ప్రయోజనం ఉండేలా చూడాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే రకంగా ఆధార్‌ను ఉపయోగించాలని, దీనికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని బాబు సూచించినట్లు తెలిసింది.
First Published:  4 July 2015 5:22 AM GMT
Next Story