Telugu Global
Others

రెవంత్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేత‌

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు కోరుతూ ఏసీబీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. రేవంత్‌తోపాటు మ‌రో ఇద్ద‌రు స‌హ నిందితులు సెబాస్టియ‌న్‌, ఉద‌య్‌సింహ‌ల‌కు ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) దాఖ‌లు చేసిన స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ల‌లో స‌హేతుక‌త‌ను ప్ర‌శ్నించింది. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాదులు క‌పిల్ సిబాల్‌, హ‌రీష్ సాల్వే, దుష్యంత్ ద‌వేలు, రేవంత్‌రెడ్డి త‌ర‌ఫున రాంజెఠ్మ‌లానీ త‌మ […]

రెవంత్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేత‌
X
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు కోరుతూ ఏసీబీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. రేవంత్‌తోపాటు మ‌రో ఇద్ద‌రు స‌హ నిందితులు సెబాస్టియ‌న్‌, ఉద‌య్‌సింహ‌ల‌కు ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) దాఖ‌లు చేసిన స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ల‌లో స‌హేతుక‌త‌ను ప్ర‌శ్నించింది. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాదులు క‌పిల్ సిబాల్‌, హ‌రీష్ సాల్వే, దుష్యంత్ ద‌వేలు, రేవంత్‌రెడ్డి త‌ర‌ఫున రాంజెఠ్మ‌లానీ త‌మ వాద‌న‌లు వినిపించారు. ఏసీబీ త‌ర‌ఫున క‌పిల్‌సిబాల్ బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించిన‌ప్ప‌టికీ సుప్రీంకోర్టు ప‌రిశీలన‌లోకి తీసుకోలేదు. ఏసీబీ త‌ర‌ఫున క‌పిల్ సిబాల్ త‌న వాద‌న వినిపిస్తూ ఓటుకు నోటు కేసులో ఇంకా అనేక‌మంది సాక్ష్యుల‌ను విచారించాల్సి ఉంద‌ని, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప‌రిశీలించాల్సి ఉంద‌ని తెలిపారు. రేవంత్ బ‌య‌టికి వ‌స్తే సాక్ష్యాల‌ను తారుమారు చేస్తార‌న్న వాద‌న‌తో సుప్రీంకోర్టు ఏకీభ‌వించ‌లేదు. ముఫ్ఫై రోజులు జైల్లో ఉన్నార‌ని, ఆయ‌న ఇంకేమి చేయ‌గ‌ల‌ర‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. సెక్ష‌న్ 164 కింద వాంగ్మూలాన్ని న‌మోదు చేశార‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్ట‌యిన ఒక్క‌రోజులో బెయిల్ వ‌స్తే ప‌రిశీలించాలి కాని ముఫ్ఫై రోజుల త‌ర్వాత బెయిల్ ర‌ద్దు కోర‌డం స‌మంజ‌సం కాద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. రేవంత్ విడుద‌ల‌యిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను సుప్రీంకోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. కేవ‌లం కేసు ఆధారిత స‌మాచారాన్ని మాత్ర‌మే ప‌రిశీలించి నిర్ణ‌యం వెలువ‌రించింది.
First Published:  3 July 2015 3:55 AM GMT
Next Story