ముస్లిం సోదరులకు కేసీఆర్ రంజాన్ కానుకలు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు అనేక కానుకలను ప్రకటించారు. సుమారు రెండు లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 500ల విలువైన నూతన వస్త్రాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఐదు వేల మసీదుల్లో ఉన్న ఇమామ్‌లు, మౌసమ్‌లకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్‌బోర్డు ద్వారా నమోదు చేసుకున్న మసీదులతోపాటు నమోదు చేసుకోని మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్‌లు, మౌసన్‌లకు నెలనెలా భృతి […]
BY sarvi3 July 2015 12:54 AM GMT
X
sarvi Updated On: 3 July 2015 12:54 AM GMT
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు అనేక కానుకలను ప్రకటించారు. సుమారు రెండు లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 500ల విలువైన నూతన వస్త్రాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఐదు వేల మసీదుల్లో ఉన్న ఇమామ్‌లు, మౌసమ్‌లకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వక్ఫ్‌బోర్డు ద్వారా నమోదు చేసుకున్న మసీదులతోపాటు నమోదు చేసుకోని మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్‌లు, మౌసన్‌లకు నెలనెలా భృతి అందుతుంది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసే కొత్త బట్టలకు రూ. 19 కోట్లు, భోజనాలకు రూ. 4 కోట్లు, ఇమామ్‌లకు అందించే నెల జీతంకు సంవత్సరానికి రూ. 12 కోట్లు ఖర్చవుతాయని సీఎం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల మధ్య ఉన్న మతసామరస్యాన్ని దేశానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను ఘనంగా జరుపనుందని సీఎం చెప్పారు. ముస్లిం సోదరుల కోసం ఈనెల 8న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో దావత్ -ఎ-ఇఫ్తార్ నిర్వహిస్తామని, ఈ విందుకు రాష్ట్ర మంత్రులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన అన్నారు. సౌదీ అరేబియా, ఇండోనేసియా దేశాల రాయబారులను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించనున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్ తో పాటు నగరంలోని వంద మసీదుల్లో రంజాన్ వేడుకలు జరుగుతాయని, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ రంజాన్ వేడుకలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. ప్రతి మసీదులోనూ వెయ్యి మందికి ఇఫ్తార్ విందు ఇస్తామని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం ఈ సంఖ్యను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
Next Story