Telugu Global
Others

హవాలా కేసులో దుబాయ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌

కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలున్న దుబాయ్‌ వ్యాపార వేత్త మనీష్‌ షాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ముందు ఇత‌న్ని హాజరు పర్చారు. గుజరాత్‌ కేంద్రంగా హవాలా దందా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి షాకు 700 కోట్ల రూపాయలు అందినట్ట్టు ఈడికి స‌మాచారం అందింది. 5,395 కోట్ల రూపాయలకు పైగా హవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్న అఫ్రోజ్‌, మదన్‌లాల్‌ […]

కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలున్న దుబాయ్‌ వ్యాపార వేత్త మనీష్‌ షాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ముందు ఇత‌న్ని హాజరు పర్చారు. గుజరాత్‌ కేంద్రంగా హవాలా దందా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి షాకు 700 కోట్ల రూపాయలు అందినట్ట్టు ఈడికి స‌మాచారం అందింది. 5,395 కోట్ల రూపాయలకు పైగా హవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్న అఫ్రోజ్‌, మదన్‌లాల్‌ జైన్‌ల నుంచి ఈ సొమ్ము వచ్చినట్టు తెలుసుకున్నారు. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.
First Published:  2 July 2015 1:19 PM GMT
Next Story