Telugu Global
Others

తాగుబోతు హోంగార్డే వృద్ధురాలిని చంపేశాడా?

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న బందోబ‌స్తుకు వెళుతున్న పోలీసు జీపు ఢీకొని ఓ వృద్ధురాలు చ‌నిపోయింది. అయితే ఆ జీపు న‌డుపుతున్న హోంగార్డు మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడ‌ని ఆరోపిస్తున్నారు గ్రామ‌స్తులు. ప్ర‌మాదం జ‌రిగిన త‌రువాత గాయ‌ప‌డిన హోంగార్డు క‌మ్ డ్రైవ‌ర్ రాంబాబు మ‌త్తుగా తూలుతూ ఊగుతూ క‌నిపించాడ‌ని చెబుతున్నారు. జీపులోని ఇత‌ర కానిస్టేబుళ్ల‌కు కూడా బ్రీత్ఎన‌లైజ‌ర్ టెస్టులు చేయాల‌ని డిమాండ్ చేశారు గ్రామ‌స్తులు. గురువారం పోల‌వ‌రం , పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు వ‌చ్చారు. సీఎం […]

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న బందోబ‌స్తుకు వెళుతున్న పోలీసు జీపు ఢీకొని ఓ వృద్ధురాలు చ‌నిపోయింది. అయితే ఆ జీపు న‌డుపుతున్న హోంగార్డు మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడ‌ని ఆరోపిస్తున్నారు గ్రామ‌స్తులు. ప్ర‌మాదం జ‌రిగిన త‌రువాత గాయ‌ప‌డిన హోంగార్డు క‌మ్ డ్రైవ‌ర్ రాంబాబు మ‌త్తుగా తూలుతూ ఊగుతూ క‌నిపించాడ‌ని చెబుతున్నారు. జీపులోని ఇత‌ర కానిస్టేబుళ్ల‌కు కూడా బ్రీత్ఎన‌లైజ‌ర్ టెస్టులు చేయాల‌ని డిమాండ్ చేశారు గ్రామ‌స్తులు. గురువారం పోల‌వ‌రం , పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు వ‌చ్చారు. సీఎం బందోబ‌స్తు కోసం బుట్టాయ‌గూడెం పోలీసు స్టేషన్ కానిస్టేబుళ్లు ఒక జీపులో బ‌య‌లుదేరారు. ఈ జీపును హోంగార్డు రాంబాబు న‌డిపాడు. పోల‌వ‌రంలోని ఎడ్ల‌గూడెంలో రాంగ్‌రూట్‌లో వ‌చ్చిన జీపు న‌డిచి వెళుతున్న ఇర్లపాటి మంగమ్మ (70), ఎడ్ల దేవళమ్మల‌ను ఢీకొంది. అటునుంచి రోడ్డుప‌క్క‌గా ఉన్న ఓ ఇంటిని గోడ‌ను గుద్ది ఆగిపోయింది. ఈ ప్ర‌మాదంలో మంగ‌మ్మ స్పాట్‌లోనే చ‌నిపోయింది. దేవ‌ళ‌మ్మ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో రాజ‌మండ్రి త‌ర‌లించారు. ఓ ఇంటి గోడ కూలిన ఘ‌ట‌న‌లో ఇంటి య‌జ‌మానులు త్రుటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. జీపును న‌డుపుతున్న హోంగార్డు మ‌ద్యం తాగి ఉన్నాడ‌ని, రాంగ్‌రూట్లో అతివేగంగా జీపు న‌డ‌ప‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్నారు గ్రామ‌స్తులు. ఈ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేసిన హోమంత్రి చిన‌రాజ‌ప్ప మృతురాలికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. దేవ‌ళ‌మ్మ‌కు మెరుగైన చికిత్స అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. హోంగార్డు రాంబాబును స‌స్పెండ్ చేశారు. డ్రైవింగ్ చేస్తున్న రాంబాబు మ‌ద్యం తాగి ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు హోంమంత్రి.
First Published:  2 July 2015 1:15 PM GMT
Next Story