Telugu Global
Others

కృతి కన్ ఫర్మ్ అయింది

బాలీవుడ్ సూపర్ స్టార్, కండలవీరుడు సల్మాన్ సరసన మహేష్ హీరోయిన్ కృతి సనోన్ హీరోయిన్  గా నటించనుందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ వార్తలన్నీ నిజమయ్యాయి. కృతి సనోన్ కు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కొత్త సినిమా సుల్తాన్ లో కృతిని హీరోయిన్ గా తీసుకుంటున్నాడు సల్మాన్. ఈ మేరకు దర్శక-నిర్మాతలకు సూచనలు ఇచ్చాడు. కృతితో మాట్లాడి డేట్స్ ఫిక్స్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఇప్పటికే కృతి సనోన్ షారూక్ సినిమాలో నటిస్తోంది. షారూక్-వరుణ్ […]

కృతి కన్ ఫర్మ్ అయింది
X
బాలీవుడ్ సూపర్ స్టార్, కండలవీరుడు సల్మాన్ సరసన మహేష్ హీరోయిన్ కృతి సనోన్ హీరోయిన్ గా నటించనుందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ వార్తలన్నీ నిజమయ్యాయి. కృతి సనోన్ కు సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కొత్త సినిమా సుల్తాన్ లో కృతిని హీరోయిన్ గా తీసుకుంటున్నాడు సల్మాన్. ఈ మేరకు దర్శక-నిర్మాతలకు సూచనలు ఇచ్చాడు. కృతితో మాట్లాడి డేట్స్ ఫిక్స్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఇప్పటికే కృతి సనోన్ షారూక్ సినిమాలో నటిస్తోంది. షారూక్-వరుణ్ ధావన్ హీరోలుగా నటిస్తున్న దిల్ వాలే సినిమాలో కృతిసనోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంటుండగానే సల్మాన్ సినిమాలో ఛాన్స్ సంపాదించింది. ప్రస్తుతం సల్మాన్ భజరంగీ భాయ్ జాన్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తర్వాత సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో కూడా పాల్గొంటాడు సల్మాన్. ఆ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత కృతి సనోన్ తో కలిసి సెట్స్ పైకివెళ్తాడు. వచ్చే ఏడాది రంజాన్ కానుకగా కృతిసనోన్-సల్మాన్ సినిమా విడుదలకానుంది.
First Published:  1 July 2015 7:02 PM GMT
Next Story