Telugu Global
NEWS

ఇక ఆకుప‌చ్చ‌ని తెలంగాణ‌!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరుగ్రామంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటి దశగా ఈ వానాకాలంలో సుమారు 40కోట్ల మొక్కలను నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది. సెప్టెంబర్‌లో వానాకాలం ముగుస్తుంది కనుక ఆలోగా ఒక్కో శాసనసభా నియోజకవర్గానికి దాదాపు 30 నుంచి 40లక్షల మొక్కల చొప్పున […]

ఇక ఆకుప‌చ్చ‌ని తెలంగాణ‌!
X
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరుగ్రామంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటి దశగా ఈ వానాకాలంలో సుమారు 40కోట్ల మొక్కలను నాటాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది. సెప్టెంబర్‌లో వానాకాలం ముగుస్తుంది కనుక ఆలోగా ఒక్కో శాసనసభా నియోజకవర్గానికి దాదాపు 30 నుంచి 40లక్షల మొక్కల చొప్పున నాటాలని నిర్ణయించింది. మొదటిదశ హరితహారంలో 40కోట్ల మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లను నోడల్ ఏజెన్సీగా ఉన్న అటవీశాఖ పర్యవేక్షిస్తున్నది. మొదటి దశ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 4,135 నర్సరీలలో దాదాపు 39కోట్ల 53లక్షల మొక్కలు సిద్ధమయ్యాయి. హరితహారం కార్యక్రమం ఈ నెల 3 నుంచి 10 వరకు కొనసాగుతున్నది. ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హరితహారం కార్యక్రమంలో వారంపాటు పాల్గొంటారు.
First Published:  1 July 2015 10:18 PM GMT
Next Story