Telugu Global
Others

కాంగ్రెస్ న‌న్ను అవ‌మానించింది

నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా జీవితాంత కొన‌సాగాల‌న్న త‌న ఆశ‌యాన్ని కొంద‌రు స్వార్థ‌ప‌రులు, అసూయ‌ప‌రులు తూట్లు పొడిచార‌ని,  పార్టీలో జ‌రిగిన అవ‌మానాలను భ‌రించ‌లేక‌నే  పార్టీని వీడుతున్నాన‌ని మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.  డీ.ఎస్. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లోకి చేర‌తార‌ని ఊహాగానాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌నే స్వ‌యంగా పార్టీ వీడుతున్న  విష‌యాన్ని  అధినేత్రికి లేఖ రాయ‌డం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకొంది. కాంగ్రెస్ పార్టీ వ‌ల‌నే  తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. అయితే, ఆ […]

నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా జీవితాంత కొన‌సాగాల‌న్న త‌న ఆశ‌యాన్ని కొంద‌రు స్వార్థ‌ప‌రులు, అసూయ‌ప‌రులు తూట్లు పొడిచార‌ని, పార్టీలో జ‌రిగిన అవ‌మానాలను భ‌రించ‌లేక‌నే పార్టీని వీడుతున్నాన‌ని మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్ ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. డీ.ఎస్. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లోకి చేర‌తార‌ని ఊహాగానాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌నే స్వ‌యంగా పార్టీ వీడుతున్న విష‌యాన్ని అధినేత్రికి లేఖ రాయ‌డం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకొంది. కాంగ్రెస్ పార్టీ వ‌ల‌నే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. అయితే, ఆ ఘ‌న‌త‌ను ఎన్నిక‌ల్లో ఉప‌యోగించుకోలేక పోయాం. అందుకు కార‌ణం బ‌ల‌హీన‌మైన నాయ‌కులు, వారి స్వార్థమ‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన జానారెడ్డి, జీవ‌న్‌రెడ్డి, జైపాల్ రెడ్డి వంటి వారికి ఉన్న‌త ప‌ద‌వులు ఇస్తూ, విద్యార్ధి ద‌శ నుంచి పార్టీకే అంకిత‌మైన న‌న్ను చుల‌క‌న చేసి అవ‌మానించార‌ని, అంత‌ర్గ‌తంగా ఇబ్బందుల‌కు గురి చేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ దిగ్విజ‌య్ సింగ్ నాపై క‌క్ష గ‌ట్టారు. జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొన‌సాగాల‌ని ఉన్నా, పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిణామాల‌తో కొన‌సాగ‌లే పోతున్నాన‌ని, అవ‌మాన‌క‌ర ప‌రిస్థితుల్లో పార్టీలో ఉండ‌లేక, బాధాత‌ప్త హృద‌యంతో బైట‌కు వెళుతున్నాన‌ని ఆయ‌న సోనియాకు రాసిన లేఖ‌లో వివ‌రించారు.

First Published:  1 July 2015 1:05 PM GMT
Next Story