రైలు రద్దయితే సొమ్ము వాపస్ ఈజీ
ఏకారణం చేతయినా రిజర్వేషన్ చేయించుకున్న రైలు రద్దయితే తమ టికెట్ సొమ్మును సులభంగా వాపసు పొందే సౌకర్యాన్ని రైల్వే శాఖ తీసుకు వస్తోంది. ఇంటర్నెట్ ద్వారా టికెట్లు తీసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రైలు ప్రయాణీకులకు చార్ట్‌లో బెర్తు ఖాయం కాకపోతే దానంతట అదే రద్దయి పోయే అవకాశం ఇప్పటికే ఉంది. ఈ పద్ధతిలో ఎలాంటి దరఖాస్తు చేయకుండానే ప్రయాణీకుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఇదే పద్ధతిని రైలు రద్దయినప్పుడు కూడా వర్తింప […]
ఏకారణం చేతయినా రిజర్వేషన్ చేయించుకున్న రైలు రద్దయితే తమ టికెట్ సొమ్మును సులభంగా వాపసు పొందే సౌకర్యాన్ని రైల్వే శాఖ తీసుకు వస్తోంది. ఇంటర్నెట్ ద్వారా టికెట్లు తీసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రైలు ప్రయాణీకులకు చార్ట్‌లో బెర్తు ఖాయం కాకపోతే దానంతట అదే రద్దయి పోయే అవకాశం ఇప్పటికే ఉంది. ఈ పద్ధతిలో ఎలాంటి దరఖాస్తు చేయకుండానే ప్రయాణీకుల బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఇదే పద్ధతిని రైలు రద్దయినప్పుడు కూడా వర్తింప చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో విడిగా టికెట్‌ను రద్దు చేయడం గానీ, టికెట్ జమ రసీదును దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా దానంతట అదే సొమ్ము ప్రయాణీకుల ఖాతాలో జమ అవుతుంది. ఈ విధానం ఇంటర్నెట్ లో టికెట్ తీసుకున్న ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది. రిజర్వేషన్ కేంద్రాల్లో తీసుకున్న టికెట్లను మాత్రం ఎప్పటి మాదిరిగా కౌంటర్లలోనే రద్దు చేసుకోవాలి. సాఫ్ట్ వేర్‌లో తగిన మార్పులు చేస్తున్నామని, కొత్త విధానం త్వరలోనే అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ అధికారి వెల్లడించారు.