Telugu Global
Others

ఇండొనేషియాలో విమానం కూలి 116 మంది దుర్మ‌ర‌ణం

ఇండొనేషియాలో ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్‌పోర్ట్ విమానం కూలి 116 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. గాల్లోకి ఎగిరిన రెండు నిమిషాలకే ఈ విమానం కూలిపోయింది. మెదాన్ నగరంలోని ఖాళీ నివాసాలపై ఇది కూలిపోయింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో విమానంలో 101 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 116 మంది ఉన్నారు. వీరంతా మ‌ర‌ణించి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. వీరితోపాటు ప్రమాద సమయంలో నేలపై ఉన్న మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడంతో […]

ఇండొనేషియాలో విమానం కూలి 116 మంది దుర్మ‌ర‌ణం
X

ఇండొనేషియాలో ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్‌పోర్ట్ విమానం కూలి 116 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. గాల్లోకి ఎగిరిన రెండు నిమిషాలకే ఈ విమానం కూలిపోయింది. మెదాన్ నగరంలోని ఖాళీ నివాసాలపై ఇది కూలిపోయింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో విమానంలో 101 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 116 మంది ఉన్నారు. వీరంతా మ‌ర‌ణించి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. వీరితోపాటు ప్రమాద సమయంలో నేలపై ఉన్న మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 116 అయ్యింది. మెదాన్‌లోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టాంజుంగ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో సైనిక సిబ్బంది బంధువులున్నారని తెలిసింది. అయితే ప్ర‌మాదానికి ఇంత‌వ‌ర‌కు కార‌ణాలు తెలియ‌రాలేదు. బ‌హుశా సాంకేతిక స‌మ‌స్య‌ల వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Next Story